పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మహీంద్రా సంస్థకు చెంది స్కార్పియో వాహనాలను కొనుగులు చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయదశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 'యాత్ర' చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, జనసేన పార్టీ కొత్త వాహనాల్ని కొనుగోలు చేసింది.
మార్కెట్లో మంచి డిమాండ్ వున్న మహీంద్రా నుంచి కొత్త స్కార్పియోను జనసేన కొనుగోలు చేసింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం (మంగళగిరి)లో ఈ కొత్త వాహనాలు కొలువు దీరడంతో, వీటిని చూసేందుకు జనసైనికులు పోటీ పడుతున్నారు.
పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక వాహనాలు ఎలాగూ వుంటాయి. జనసేన ముఖ్య నేతల కోసం ఈ వాహనాల్ని వినియోగిస్తారని తెలుస్తోంది.