Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజుకో గోల్డ్ మెడల్ - ప్రెసిడెంట్ మెడల్ సాధిస్తున్నారు : నాగబాబు సెటైర్లు

Advertiesment
రోజుకో గోల్డ్ మెడల్ - ప్రెసిడెంట్ మెడల్ సాధిస్తున్నారు : నాగబాబు సెటైర్లు
, మంగళవారం, 15 మార్చి 2022 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా పాలనపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. సాధారణంగా విద్యార్థులకు చదువుల్లో గోల్డ్ మెడల్ సాధించడం అంత ఈజీ కాదన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ప్రతి రోజూ గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్‌ను సాధిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. 
 
వైకాపా అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణ మద్య నిషేధం సంగతి దేవుడెరుగ... సరికొత్త బ్రాండ్లతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఇందులోభాగంగానే గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్ అంటూ సరికొత్త మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ఉద్దేసించే నాగబాబు సెటైర్లు వేశారు. 
 
సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇందులో నాగబాబు పాల్గొని ప్రసంగించారు. జగన్ వచ్చాక ప్రజలకు అప్పులు, తిప్పలు, కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని, ఆ బాధలు మరిపించేందుకు కొత్తరకం మద్యం బ్రాండ్లను తీసుకొచ్చారన్నారు. గోల్డ్ మెడల్ సాధించడం అంటే ఎంతో గొప్ప విషయమని, కానీ, అదేంటో ఏపీలో చాలా మంది చేతిలో గోల్డ్ మెడల్ (ఓ లిక్కర్ బాటిల్) ఉంటోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
రోజుకో గోల్డ్ మెడల్, కొందరైతే ప్రెసిడెంట్ మెడల్ కూడా సాధిస్తున్నారంటూ ఎద్దేవా చశారు. ఏపీలో ప్రతి పౌరుడి మీద లక్ష రూపాయల పైమాటే అప్పు ఉందని, ఇదంతా పౌరులే పన్నుల రూపంలో ఈ అప్పు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అసలు సీఎం జగన్ మంత్రివర్గంలోని కొందరు మంత్రుల పరిస్థితి ఏం బాగాలేదని విమర్శించారు. ఆ మంత్రులకు తమ శాఖలేంటో గుర్తుండవని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'స్టెల్త్ ఒమిక్రాన్' దెబ్బకు వణుకుతున్న చైనా - పలు నగరాల్లో లాక్డౌన్