Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక నేరాలపై విచారణ, విజసాయిరెడ్డికి వెన్నులో వణుకు: బుద్దా వెంకన్న

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:36 IST)
ఆర్థికనేరాల కేసు విచారణను ఏడాది లోపే పూర్తిచేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించడంతో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి వెన్నులో వణుకు మొదలయ్యిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అందువల్లే న్యాయవ్యవస్థపై దాడిని మొదలుపెట్టారని అన్నారు. 11 చార్జ్ షీట్లు, లక్షకోట్ల దోపిడీ, సూట్కేసు కంపినీల సూత్రధారి, క్రిడ్‌ప్రోకో పిత, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పైన వచ్చిన విజసాయిరెడ్డి, జగన్‌లు న్యాయవ్యవస్థ గురించి మాట్లాడడం వింతగా ఉందని విమర్శించారు.
 
లక్ష కోట్ల దోపిడీ కేసు విచారణ వివరాలు మీడియాలో వస్తే పరువుకు భంగం కలుగుతుందంటూ మీడియాలో కేసు వివరాలు ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టులను కోరిన జగన్, విజయసాయి ఈరోజు పత్రికా స్వేచ్చ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు.
 
మీడియా గొంతులను నొక్కుతూ జీవో తీసుకొచ్చిన జగన్ వివిధ కేసుల్లో వివిద కోర్టులు అనేక సందర్భాల్లో ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను తప్పుపట్టడం న్యాయస్థానాలను కించపరచడమే అవుతుందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments