Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం.. సీబీఐకి అప్పగింత

Advertiesment
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం.. సీబీఐకి అప్పగింత
, బుధవారం, 19 ఆగస్టు 2020 (13:13 IST)
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. జూన్‌ 14లో సుశాంత్‌ తన నివాసంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. 
 
ఇప్పటివరకూ ఈ కేసుకి సంబంధించి సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. సుశాంత్‌ ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు. ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా పాత్రపైన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం న్యాయబద్ధమైనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
 
ఈ కేసులో సింగిల్ బెంచ్ జస్టిస్ హృషికేశ్ రాయ్ ఇచ్చిన తీర్పును సుశాంత్‌ కుటుంబసభ్యులు స్వాగతించారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రియా పాత్రపై, సుశాంత్‌కి చెందిన కోట్లాది రూపాయలు ఆమె అకౌంట్‌కు బదిలీ అయిన విషయాలపై ఆమెను ప్రశ్నించారు. అయితే తనకేం తెలియదని ఆమె చెబుతోంది.
 
సుప్రీం నిర్ణయంపై బాలీవుడ్లో ట్వీట్ల వరద పారుతోంది. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. విజయానికి, నిష్పాక్షిక దర్యాప్తునకు తొలి అడుగు పడిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రార్థనలకు ఫలితం లభించిందంటూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ చాలా హాట్, నాకు క్రష్ అంటున్న నటి కస్తూరి