Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జనరేషన్‌లో ఒకరిద్దరు అబ్బాయిలతో రిలేషన్ చాలా కామన్ : సోనూ శర్మ

ఈ జనరేషన్‌లో ఒకరిద్దరు అబ్బాయిలతో రిలేషన్ చాలా కామన్ అని హైదరాబాద్‌లోని మయూరి పాన్ షాపు యజమాని చేతిలో మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి సోనూ శర్మ చెప్పుకొచ్చింది.

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (18:06 IST)
ఈ జనరేషన్‌లో ఒకరిద్దరు అబ్బాయిలతో రిలేషన్ చాలా కామన్ అని హైదరాబాద్‌లోని మయూరి పాన్ షాపు యజమాని చేతిలో మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి సోనూ శర్మ చెప్పుకొచ్చింది. పైగా, తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనే సంగతి పాన్ షాపు యజమానికి బాగా తెలుసనీ, అయినప్పటికీ తనకోసం ఆరాటపడ్డారని తెలిపింది.
 
హైదరాబాద్‌లోని మయూరీ పాన్ షాపుల యజమాని ఉపేంద్ర వర్మకు తనకు పాన్‌లో మత్తుమందు కలిసి అత్యాచారం చేసినట్టు సోనూ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. దీనిపై సోనూ శర్మ స్పందిస్తూ, తాను తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనే విషయం ముందుగానే ఆయనకు తెలుసుని చెప్పుకొచ్చింది. 
 
పైగా, తమకు సెప్టెంబర్ 2, 2017న వివాహం అయిందని చెప్పింది. ఉపేంద్రకు ఇంతకుముందే ప్రీతి అనే యువతితో వివాహం జరిగినట్టు తనకు తెలియదని వెల్లడించింది. ఉపేంద్ర తనకు ఎన్నడూ రూ.40 లక్షలు ఇవ్వలేదని, తాను కోటి రూపాయలు డిమాండ్ చేశానని చేసిన అరోపణలు సైతం అవాస్తవమేనని స్పష్టంచేసింది. 
 
ఉపేంద్ర సోదరుడు మీడియాకు విడుదల చేసిన ఫోటోలను తానే గతంలో ఉపేంద్రకు చూపించానని, తన గురించిన అన్ని విషయాలూ అతనికి తెలుసునని చెప్పింది. ఉపేంద్ర తనను దారుణంగా మోసం చేశాడని, ఇప్పుడు తానేమీ అతనితో ఉండాలని కోరుకోవడం లేదని, చేసిన తప్పును అతను బహిరంగంగా అంగీకరించాల్సిందేనని స్పష్టంచేసింది. 
 
పైగా, ఈ జనరేషన్‌లో ఒకరిద్దరు అబ్బాయిలతో రిలేషన్ చాలా కామన్ అని, తనకూ ఉన్నాయని చెప్పుకొచ్చింది. కాలేజీ రోజుల్లో తనకున్న అఫైర్ గురించి నాలుగున్నర సంవత్సరాల క్రితమే ఉపేంద్రకు తెలుసునని వెల్లడించింది. అన్నీ తెలిసే తనను ఇలా మోసం చేశాడనీ ఆమె వాపోయింది. ఈ కేసులో తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని సోనూ శర్మ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments