జబర్దస్త్ యాంకర్ చలాకీ చంటి కారుకు ప్రమాదం.. నుజ్జునుజ్జు..
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు జబర్ధస్త్ యాంకర్ చలాకీ చంటీది. ఈ కారులో చంటీతోపాటు మరో నటులు హరికృష్ణ, హరి చరణ్ కూడా ఉన్నారు. సోమవారం స
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు జబర్ధస్త్ యాంకర్ చలాకీ చంటీది. ఈ కారులో చంటీతోపాటు మరో నటులు హరికృష్ణ, హరి చరణ్ కూడా ఉన్నారు. సోమవారం సాయంత్రం వీరందరూ కలిసి శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
మంగళవారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని బాలానగర్ దగ్గరకు చేరుకుంటుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు చలాకీ చంటి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో చలాకీ చంటీ కారు వెనక భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.
చలాకీ చంటి కారు దెబ్బతినటంతో.. మరో కారులో జబర్ధస్త్ నటులు హైదరాబాద్ చేరుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఇటీవల యాంకర్ లోబో శంకర్ కూడా కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.