Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్ల ఫోటోలు.. రేటు కార్డులతో ఎస్కార్ట్ సర్వీస్.. మాజీ ప్రిన్సిపాల్ వక్రబుద్ధి

విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఓ కళాశాల ప్రిన్సిపాల్... అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని నిర్ణయించాడు. ఇందుకోసం హీరోయిన్ల ఫోటోలతో ఎస్కార్ట్ సర్వీస్‌ను ప్రారంభించాడు.

Advertiesment
హీరోయిన్ల ఫోటోలు.. రేటు కార్డులతో ఎస్కార్ట్ సర్వీస్.. మాజీ ప్రిన్సిపాల్ వక్రబుద్ధి
, గురువారం, 14 జూన్ 2018 (10:22 IST)
విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఓ కళాశాల ప్రిన్సిపాల్... అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని నిర్ణయించాడు. ఇందుకోసం హీరోయిన్ల ఫోటోలతో ఎస్కార్ట్ సర్వీస్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత పలువురు యువకుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్ నగరానికి చెందిన గణేష్ అనే వ్యక్తి సైన్సులో పీజీ పూర్తి చేశాడు. అనంతరం పలు ప్రముఖ ఇంటర్ కళాశాలల్లో లెక్చరరుగా పనిచేసి ఇటీవల దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా చేరాడు. అయితే, ఇక్కడ ఇచ్చే నెల జీతం సరిపోలేదనీ, పైగా, డబ్బు బాగా సంపాదించాలన్న కోరిక ఏర్పడింది. దీంతో ఈ ఉద్యోగాన్ని వదిలివేశాడు. 
 
దీంతో మాజీ ప్రిన్సిపాల్‌గా మారిన గణేష్... ప్రముఖ సినీతారల ఫోటోలు క్లాసిఫైడ్ వెబ్‌సైట్‌లో పెట్టి వారి పేరిట రూ.40 వేల నుంచి రూ.60 వేలంటూ రేట్ కార్డులు పెట్టి ఏ ఎస్కార్ట్ సర్వీస్ ప్రారంభించాడు. ఆ తర్వాత క్లాసిఫైడ్ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించే యువకుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. యువకులు ఎస్కార్టు సర్వీసు కోసం డబ్బు ఖాతాకు బదిలీ చేయగానే మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసేవాడు. 
 
దీంతో ఓ ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు.. మాజీ ప్రిన్సిపాల్ గణేష్‌పై ఐటీ యాక్టు కింద కేసు పెట్టి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
 
తాను వ్యాపారంలో నష్టపోవడంతో దాన్నుంచి బయటపడేందుకే ఎస్కార్టు సర్వీసు పేరిట చీటింగ్ చేశానని గణేష్ పోలీసుల ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గణేష్ ఖాతాలో ఎస్కార్టు సర్వీసు పేరిట రూ.8 లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రెండింగ్-మోదీ వర్కవుట్ వీడియో.. మార్ఫింగ్ ఫోటోలతో నెట్టింట సెటైర్లు