Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నుంచి కోలుకున్న తల్లి.... ఇంట్లో అడుగుపెట్టొద్దంటూ కొడుకు హుకుం

Webdunia
శనివారం, 25 జులై 2020 (09:00 IST)
ఆ తల్లి కరోనా వైరస్ బారినపడింది. ఓ ప్రభుత్వ దావఖానాలో చికిత్స తీసుకున్న తర్వాత కోవిడ్ కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక గంపెడాశలతో ఇంటికి వచ్చింది. కానీ, కన్నబిడ్డతో పాటు.. కోడలు ఆమె ఆశలకు బ్రేక్ వేశారు. ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. అంతేనా.. ఏకంగా ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగరులో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక బీజేఆర్ నగర్‌కు చెందిన మహిళ (55)కు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆమె శుక్రవారం ఇంటికి చేరుకుంది. 
 
మహమ్మారిని జయించి ఇంటికొచ్చిన తల్లిని చూసిన ఆమె కొడుకు, కోడలు ఆప్యాయంగా పలకరించకపోగా, ఇంట్లోకి అడుగుపెట్టవద్దంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు, ఇంటిపైకప్పు రేకులను ధ్వంసం చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కొడుకు, కోడలు తీరుతో విస్తుపోయిన ఆమె రాత్రంతా ఇంటి ముందే గడిపింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments