Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయి రెండేళ్ళు.. భర్త టచ్ కూడా చేయలేదు...ఆ తరువాత..?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:08 IST)
కోటి ఆశలతో పెళ్ళి చేసుకుంది. కట్టుకున్న భర్త జీవితాంతం కలిసి ఉంటాడని సంబరపడింది. పిల్లాపాపలతో సంసారజీవితాన్ని సుఖంగా గడుపుతామని కలలు కనింది. కానీ ఆ కలలన్నీ కల్లలుగా మిగిలిపోయాయి. పెళ్ళి చేసుకున్న భర్త నపుంశకుడని తెలిసి కుమిలిపోయింది. 
 
తాను సంసార జీవితానికి పనికిరానన్న విషయాన్ని బయటకు చెప్పొద్దని భర్త ప్రాదేయపడితే ఆ విషయాన్ని మనస్సులో దాచుకుంది. కానీ భర్త కట్నం కావాలని చిత్రహింసలకు గురిచేస్తుంటే మాత్రం తట్టుకోలేకపోయింది. చిత్తూరు జిల్లా పాకాలలో సంఘటన జరిగింది.
 
పాకాలమండలంలోని దామలచెరువు పంచాయతీ మొరవపల్లెకు చెందిన రాజేంద్రనాయుడు, ఉషారాణిల కుమార్తె దీపిక. ఎంబీఏ వరకు చదువుకుంది. చిత్తూరు రాంనగర్ కాలనీలో నివాసముండే సుజాత, గోవిందస్వామి నాయుడుల కుమారుడు శ్యాంప్రసాద్‌కు ఇచ్చి 2017 ఆగష్టు 13వ తేదీన తిరుమలలో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేశారు. 
 
కట్నం 2లక్షలు, అదనంగా మరో లక్షతో పాటు శ్యాంప్రసాద్‌కు బంగారు నగలు ఇచ్చారు. శ్యాంప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. దీపిక కూడా బెంగుళూరులోనే పనిచేస్తుండడంతో ఇద్దరూ పెళ్ళి తరువాత అక్కడే కాపురం పెట్టారు. వివాహమైన వారంరోజులకే భర్త శ్యాంప్రసాద్ సంసారానికి పనికిరాడని తెలుసుకుంది. అతని వద్ద కొన్ని రకాల మాత్రల ప్రిస్కిప్షన్ లభించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఆ ప్రిస్కిప్షన్‌ను వైద్యులకు చూపించింది. పుంసత్వం కోసం మందులు వాడుతారని తెలుసుకుంది. భర్తను గట్టిగా ప్రశ్నించింది.
 
అత్త,మామలను నిలదీసింది. నిజం ఒప్పుకోవడంతో నివ్వెరపోయింది. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని భర్తతో పాటు అత్త, మామలు ప్రాధేయపడ్డారు. దీంతో ఆ బాధను దిగమింగింది. అయితే తరచూ భర్త డబ్బులు కావాలని అదనపు కట్నం తీసుకురమ్మని హింసించే వాడు. ఇంట్లో ప్రశాంతత కరువవడంతో అసలు విషయాన్ని తన తల్లికి చెప్పింది. 
 
దీపిక తల్లిదండ్రులు బెంగుళూరుకు వెళ్ళి శ్యాంప్రసాద్‌తో మాట్లాడారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో దీపిక పాకాల పోలీసులను ఆశ్రయించింది. భర్త వేధింపులపై కేసు పెట్టి న్యాయం కావాలని కోరుతోంది. పోలీసులు శ్యాంప్రసాద్ పైన కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments