ఆంధ్రాలో గణనీయంగా తగ్గిన పాజటివ్ కేసులు

Webdunia
సోమవారం, 24 మే 2021 (18:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. నిన్నామొన్నటివరకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ, సోమవారం ఈ కేసుల సంఖ్య 12 వేలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 12,994 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి చేరింది. తాజాగా 96 మరణాలు న‌మోద‌య్యాయి. 
 
క‌రోనా వ‌ల్ల కొత్త‌గా చిత్తూరులో 14, క‌ర్నూల్‌లో 10, విజ‌య‌న‌గ‌రంలో 10, అనంత‌పూర్‌లో 9, తూర్పుగోదావరిలో 8, విశాఖ‌ప‌ట్నంలో 8, గుంటూరులో 7, కృష్ణలో 7, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 7, ప‌శ్చిమ గోదావ‌రిలో 4, ప్రకాశంలో 3, క‌డ‌ప‌లో 2 చొప్పున మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 
 
అలాగే, ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ బులిటెన్‌లో వెల్ల‌డించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments