Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు: నీలం సాహ్ని

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (05:51 IST)
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు మంజూరు చేసే దిశగా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులకు సూచించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో రాష్ట్రంలోని పట్టణ గృహ నిర్మాణాలపై స్టేట్ లెవల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీతో సీఎస్  నీలం సాహ్ని సమీక్షా సమీవేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అధికారులు సిద్ధం చేసిన పీఎంఏవై గృహాలకు సంబంధించిన డీపీఆర్ కు సీఎస్ ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం 3,70,255 పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) గృహాల మంజూరుకు సంబంధించిన  డీపీఆర్ పై  సీఎస్ చర్చించిన అనంతరం ఆమోదం తెలిపారు. 

గృహాల మంజూరుకు  డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం కు పంపించనున్నారు.  గృహాల మంజూరుకు సంబంధించి ఏర్పాటైన స్టేట్ లెవల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీలో సీఎస్ తో పాటు  పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ (ల్యాండ్  అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ, ఏపిటిడ్కో ఎండీ ఉన్నారు.

ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజైయ్ జైన్, పురపాలక పరిపాలన కార్యదర్శి శ్యామలారావు, ల్యాండ్ ఎండోమెంట్స్ కార్యదర్శి ఉషారాణి, ఏపీటిడ్కో ఎండీ మైదీన్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments