మచిలీపట్నం పోర్టును వెంటనే పూర్తి చేయాలి: జగన్

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (05:47 IST)
మచిలీపట్నం పోర్టును వెంటనే పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అధికారులతో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలోని 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

పరిశ్రమల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై సమీక్షించారు. దుగరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల ప్రణాళికల తయారీకి ఆదేశించారు. తొలి దశలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

మచిలీపట్నం పోర్టుకు భూమి అందుబాటులో ఉండటంతో వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిగిలిన పోర్టుల నిర్మాణ స్థలాల్లో వెంటనే భూమి సేకరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్ కల్లా ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మే, జూన్ నాటికల్లా రెండుపోర్టులకూ శంకుస్థాపన చేస్తామని జగన్ చెప్పారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments