Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు.. మంత్రి హరీష్ రావు

నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు.. మంత్రి హరీష్ రావు
, శనివారం, 2 నవంబరు 2019 (17:40 IST)
సిద్దిపేట పట్టణ నిరుపేదల సొంతింటి కల నెరవేరిచే సంకల్పంతో నర్సపూర్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి దశలో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ అరణ్య భవన్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సెలక్షన్ కమిటీ సభ్యులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలకు, అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇల్లు ఎంపిక చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హత లేని వారిని గుర్తించాలన్నారు. పట్టణములో 11వేల 657 దరఖాస్తులు వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు.

11వేల 657 దరఖాస్తుల్లో నిజమైన లబ్ది దారులకె దక్కే విధంగా చూడాలన్నారు. గతంలో ఆయా పథకాల ద్వారా ఇల్లు పొందిన వారిని, ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన వారిని గుర్తించాలన్నారు. అదేవిధంగా సొంతంగా స్థలాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉంటే వారిని అనర్హుల జాబితాలోకి చేర్చాలని ఆదేశించారు.

ధరఖాస్తు దారుల్లో ఎవరికి ఎంత భూమి ఉంది. గృహ రుణాలు తీసుకున్న వారు ఎంతమంది, ఆస్తి పన్ను కట్టే వారిని, ట్రేడ్ లైసెన్స్ ఉన్న పెద్ద వ్యాపారులను గుర్తించి తొలగించాలన్నారు. మున్సిపల్ పరిధిలో 50వేల విద్యుత్ కనెక్షన్ లు ఉన్నాయని , దరఖాస్తు చేసుకున్న వారి పేరుతో విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయోమో పరిశీలించాలని చెప్పారు.

ఒకవేల వారి పేరుతో విద్యుత్ కనెక్షన్ ఉంటే సొంత ఇల్లు ఉన్నట్టే అని నిర్ధారించి అనర్హులుగా గుర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్రూం ఇల్లు నిరుపేదలకె దక్కాలని, ఈ విషయంలో ఏలాంటి రాజకీయ జోక్యం ఉండదు అని చెప్పారు. ఎంపిక వేగవంతంగా చేపట్టాలని సూచించారు.
 
సమగ్ర నివేదికను వినియోగించుకోవాలి
రెండు పడకల ఇళ్ల కేటాయింపుల కోసం అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ రూపొందించిన సమగ్ర వేదికను వినియోగించుకోవాలని ఎంపిక కమిటి సభ్యులకు సూచించారు.

రాష్ట్రంలో 12రకాల రికార్డులకు సంబంధించిన సమాచారంతో నిజమైన లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలో టి ఎస్ టి ఎస్ ఎం డి వెంకటేశ్వర్లు మంత్రి కి వివరించారు. సిద్దిపేట మున్సిపాలిటీ లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఈ సమాచారం తో బేరీజు చేసుకొని ఎంపిక చేయాలని కలెక్టర్ వెంకటామరెడ్డిని ఆదేశించారు.

ఈ సమాచారంతో పాటు క్షేత్ర స్థాయిలో పరిశీలిన జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ టి ఎస్ ఎండి వేంకటేశ్వర్లు, జిల్లా అధికారులు శ్రవణ్, చరణ్ దాస్, ఎస్ ఈ విద్యుత్ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మన్ తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి కోసం డిపాజిట్​ చేస్తే పాలసీలు చేశాడు