Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్య వృత్తిని వదిలి.. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో సహజీవనం.. ఆపై అనుమానాస్పద...

వేశ్య వృత్తిని వదిలి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తూ వచ్చిన ఓ మహిళ అనునాస్పదంగా మరణించింది. గుంటూరు పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (09:14 IST)
వేశ్య వృత్తిని వదిలి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తూ వచ్చిన ఓ మహిళ అనునాస్పదంగా మరణించింది. గుంటూరు పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన డేరంగుల శ్రీలక్ష్మి (21) అలియాస్ భాను అలియాస్ బంగారం అనే యువతి గత 2014లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఆ తర్వాత ఇదే వృత్తిలో కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో గుంటూరు పట్టణానికి చెందిన అఖిల్ తేజ అనే యువకుడితో పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి అరండల్ పేట లాడ్జి సెంటర్ సమీపంలోని ఓ బార్ ఎదురుగా ఉన్న గదిలో నివశిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 20న అఖిల్ హైదరాబాద్, వెళ్లి, శనివారం మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. ఇంట్లోంచి వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చేవరకు మృతదేహం కుళ్లిపోయే పరిస్థితిలో ఉంది. మృతదేహం పక్కనే కూల్‌డ్రింక్, మజ్జిగ ప్యాకెట్లు ఉన్నాయి. లోపలినుంచి తలుపు గడియ పెట్టుకోకపోవడంతో ఇది హత్యేనన్న అనుమానాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
 
దీనిపై అఖిల్ తేజ్ స్పందిస్తూ, ఫోన్ చాటింగ్ ద్వారా తనకు పరిచయమైన శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని చెప్పి కలిసి జీవిస్తున్నట్టు తెలిపారు. తామిద్దరం భార్యాభర్తలుగానే చుట్టు పక్కల వారికి పరిచయం చేసుకున్నట్టు తెలిపారు. అదేసమయంలో ఆమెకు కామెర్లు రావడంతో మజ్జిగ తాగమని చెప్పానని అఖిల్ చెబుతున్నాడు. మొత్తం బంగారం మృతిపై పలు సందేహాలు ఉండటంతో పోలీసులు అఖిల్‌ తేజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments