Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసురు తీసిన ఇసుక... భార్య కూలీ పనులకు వెళ్తుందనీ...

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (13:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. భవన నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కార్మికులు ఉపాధి లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. అటు కూలీ పనులు లేకు.. ఇటు కుటుంబ పోషణ భారాన్ని భరించలేని పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన నాగ బ్రహ్మాజీ తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు సంగం జాగర్లమూడికి చెందిన లక్ష్మీతిరుపతమ్మతో వివాహమైంది. ఏడేళ్లుగా అదే ఊరిలోనే ఉంటూ... భవన నిర్మాణ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. 
 
అయితే, గత ఐదు నెలలుగా ఇసుక కొరతతో పనులు దొరకడంలేదు. కుటుంబాన్ని పోషించటానికి అప్పులు చేయాల్సి వచ్చింది. వాటిని తీర్చలేక, కొత్తగా అప్పులు పుట్టక నాగబ్రహ్మాజీ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటిదాకా ఇంటి దగ్గరే ఉండి పిల్లల పోషణ చూసుకునే భార్య లక్ష్మీ తిరుపతమ్మ రెండు నెలలుగా స్పిన్నింగ్‌ మిల్లులో పనికి వెళ్లి కుటుంబాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
ఆర్థిక పరిస్థితి దిగజారడం, భార్యతో పని చేయించాల్సి వచ్చిందనే బాధతో బ్రహ్మాజీ గత పదిరోజులుగా ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రెండు నెలలుగా తమ సంపాదనతోనే ఇల్లు గడుస్తోందని, అది బ్రహ్మాజీని బాధపెట్టిందని ఆయన భార్య లక్ష్మీ తిరుపతమ్మ, అత్త శివలీల తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments