Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

KCR Farm Houseలో కలకలం: తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Advertiesment
Police Constable
, బుధవారం, 16 అక్టోబరు 2019 (15:26 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మెదక్ జిల్లా యర్రవల్లిలో వుంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు.. ఏకే 47తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగిందంటున్నారు. అయితే, వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ముత్తిరెడ్డిగూడెం. ప్రస్తుతం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. 
 
అయితే, కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడని.. మద్యం మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు సిద్ధపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్. గత కొంతకాలంగా కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విధులకు హాజరు కావడంలేదని.. అతని భార్య వేడుకోవడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అరవింద్ ఆస్తి కొడుకులకు పంచేశారా? గీతా ఆర్ట్స్ పెద్దకొడుక్కి ఇచ్చేశారా?