Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలలో స్కిమ్మింగ్ ఎలా చేస్తారు?

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (13:13 IST)
సైబర్ నేరాలు అనగానే... ఇప్పటివరకు ఠక్కున గుర్తుకు వచ్చేది నైజీరియా. ఏటీఎం కార్డు అప్‌డేట్, లాటరీ వచ్చిందని, ఇలా పలు కారణాలు చెబుతూ అందినకాడికి దోచుకునేవారు. అయితే తాజాగా రొమేనియన్లు ఏటీఎం కార్డుల క్లోనింగ్ కోసం దేశంలోకి చొరబడ్డారు. వీరు కార్డులను క్లోనింగ్ చేయడంలో ఆరితేరారు. 
 
నెల రోజుల కాంట్రాక్టుతో దేశంలోని పలు పట్టణాల్లోకి వచ్చి ఏటీఎం సెంటర్లలో స్కిమ్మ ర్లు, కెమెరాలు పెట్టి డేటాను చోరీ చేసి.. ప్రధాన సైబర్ నేరగాడికి ఇచ్చేస్తున్నారు. ఇలా డేటా చోరీకి పాల్పడుతున్న రొమేనియా దేశానికి చెందిన నిందితులను గత యేడాది ఏప్రిల్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో వీరి మోసాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి అబిడ్స్ పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. అబిడ్స్ పోలీసుల దర్యాప్తులో పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
 
అసలు స్కిమ్మింగ్ ఎలా చేస్తారో ఓసారి తెలుసుకుందాం. ఏటీఎం మిషన్‌లో డబ్బులు డ్రా చేసే చోట మ్యాగ్నటిక్ రీడర్, ఒక స్పై కెమెరాను ఈ ముఠాలు అమరుస్తాయి. ఏటీఎం కేంద్రంలోకి వినియోగదారుడు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు కార్డును స్వైప్ చేసిన సమయంలో కార్డు వివరాలు మ్యాగ్నటిక్ రీడర్ కాపి చేస్తుంది. పిన్ నంబర్‌ను కెమెరా రికార్డు చేస్తుంది. ఇలా ఒక రోజంతా ఆ కార్డు మిషన్‌లో ఉంటే ఆ రోజు ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేసిన వారి వివరాలు కాపీ చేస్తుంది. 
 
అయితే ఈ ముఠాలు ఒక రోజంతా మ్యాగ్నటిక్ రీడర్, కెమెరాను ఒకే దగ్గర ఉంచకుండా జాగ్రత్త పడుతారు. కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని తొలగించి, మరో చోట ఏర్పాటు చేస్తారు. ఎక్కువ సమయం ఒకే దగ్గర ఉంచితే గుర్తిస్తారనే అనుమానంతో ఇలా మారుస్తుంటారు. సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాల్లో ఈలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. 
 
స్కిమ్మింగ్ ద్వారా సేకరించిన డేటాను ఎప్పడికప్పుడు.. తమ బాస్‌కు చేరవేస్తుంటారు. అయితే ఇక్కడ స్కిమ్మింగ్ చేసే వారిచేతిలో ల్యాప్‌టాప్‌లు ఉంటాయి. విదేశాల్లో ఉండే బాస్.. వీరి కంప్యూటర్‌ను టీమ్ వ్యూహార్‌తో యాక్సెస్ చేసుకుంటూ.. వీరి వద్ద ఉండే డేటాను తన కంప్యూటర్‌లోకి ఎప్పటికప్పుడు కాపీ చేసుకుంటాడు. అలా సేకరించిన డేటాతో క్లోనింగ్‌తో కొత్త కార్డులను తయారు చేస్తాడు. క్లోనింగ్ కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేసేందుకు మరో టీమ్‌తో ఒప్పందాలు చేసుకొని ఇండియాకు పంపిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments