Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా రాష్ట్ర సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. ఆదివారం ప్రమాణ స్వీకారం

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (12:41 IST)
హ‌ర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. రెండోసారి ఆయ‌న సీఎం బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారోత్స కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. 
 
ఇటీవల వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 40 సీట్లు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప‌ది సీట్లు గెలిచిన జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలా బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో.. ఖ‌ట్ట‌ర్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. 
 
హర్యానాలో అమిత్ షా డీల్ 
తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన హర్యానా రాష్ట్రంలో మరోమారు బీజేపీ సారథ్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకానుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.
 
మొత్తం 90 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ 31 సీట్లతో సరిపుచ్చుకోగా, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లను గెలుచుకుని కింగ్ మేకర్‌గా అవతరించింది.
 
ఈ ఫలితాలు ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కనీస మెజార్టీ 46 సీట్లు దక్కలేదు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జేజేపీ అధినేత దుశ్యంత్ చౌతలాతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించడంతో ఆయన బీజేపీకి జై కొట్టారు. 
 
ఇందుకు ప్రతిఫలంగా జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవిని కమలనాథులు కట్టబెట్టనున్నారు. అలాగే, ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఉండనున్నారు. మరోవైపు, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోమారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. శనివారం జరిగే బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లో ఆయన పేరును ఎన్నుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments