Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఆర్పీఎఫ్ జవానుతో ప్రేమ, అన్నీ అర్పించింది, సైకోలా మారి వేధించాడు, చివరికి...

Advertiesment
Love
, శుక్రవారం, 18 అక్టోబరు 2019 (19:15 IST)
సిక్కోలు జిల్లాలో ఓ సైకో సీఆర్పీఎఫ్ జవాన్ వేధింపులకు ఓ యువతి బలైపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రేమ పేరుతో వంచనకు గురై ప్రాణాలు బలితీసుకున్న మీనాక్షి రాసిన మరణ లేక కలకలం రేపుతోంది. వివరాలు పరిశీలిస్తే... మీనాక్షి అనే యువతి పలాసలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో అందాల తులసీదాస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 
 
ఆ పరిచయం ప్రేమగా మారింది. నీవు లేకపోతే నేను లేను... నా తల్లిదండ్రుల కంటే నువ్వే ఎక్కువ అంటూ తులసీదాస్ చెప్పిన మాటలకు పడిపోయిన మీనాక్షి అతనికి మరింత దగ్గరైంది. ఈక్రమంలో డిగ్రీ పూర్తయిన తర్వాత మీనాక్షి టీచర్‌గా చేరింది. ప్రియుడు తులసీదాస్‌కు సిఆర్పీఎఫ్ యూనిట్లో జాబ్ వచ్చింది. ఇద్దరూ ఉద్యోగాలు సంపాదించడంతో తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం.. చాటింగ్‌లు చేసుకుంటూ మరింత పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. 
 
దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి... ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. తీరా తన కోరిక తీరిన తర్వాత ఆమెను వదిలించుకోవడానికి పక్కాగా స్కెచ్ వేశాడు. వాట్సాప్ ద్వారా సైకో చేష్టలతో ఆమెను మానసిక వేధింపులకు గురిచేశాడు. సూటిపోటి మాటలతో చిత్రవధ చేశాడు. దీనితో ఆమె ఆత్మహత్య శరణ్యంగా భావించింది.
 
లేఖలో... ఈ బాధను ఐదు నెలలు నుండి పడుతూ వచ్చాను. మ్యారేజ్ చేసుకుంటానని చెప్పే వ్యక్తి ఇలా చేస్తుంటే ఏం చెయ్యాలో అర్ధంకాని పరిస్థితి. పోలీస్ కంప్లైంట్ చేస్తానంటే నా మనసు అంగీకరించట్లేదు. కష్టపడి జాబ్ సంపాదించుకున్నాడు. జాబ్ కోసం పడే తపన ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. నేనే పోతే నా ఫ్యామిలీకి, తులసీ వాళ్ల ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అందరూ హ్యాపీగా ఉంటారు. కారణం నేనే అయినప్పుడు నేనే అందరికీ దూరమవుతున్నాను. అని సూసైడ్ నోట్‌లో పేర్కొంది మీనాక్షి.
 
నేను ఎలాగూ చనిపోతున్నాను. కానీ నేను తులసీ ( సైకో ) చేసిన చేష్టల వల్ల చనిపోతున్నానని బీహార్ - సీఆర్పీఎఫ్ యూనిట్లో కూడా తెలియాలి అంటూ ఆఖరిగా రాసిచ్చింది మరణవాగ్మూలం. అయితే తనలాంటి పరిస్థితి మరో ఆడపిల్లకు రాకుండా ఉండేందుకు, ఇలాంటి సైకోలు సమాజంలో తిరగనీయకుండా చేయాలంటూ తన ఆఖరి మాటగా సూసైడ్ నోట్ రాసిచ్చింది మీనాక్షి. పోలీసులు కేసు నమోదు చేసుకుని సైకో జవానును అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''గూగుల్ పే ఆఫర్లు'' నమ్మారో.. ఇక మీ డబ్బు గోవిందా? లక్షలు మింగేశారు..!