Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము: వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (12:52 IST)
రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వ్యవ‌సాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు స్పష్టం చేశారు. 

ఇప్పటివరకూ 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మిల్లర్లు, దళారులను రైతులు నమ్మొద్దని సూచించారు. ఆర్‌బీకేలకు వెళ్లి కనీస మద్దతు ధరకే ధాన్యం విక్రయించుకోవాలన్నారు.

డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రకాలనే రైతులు సాగు చేయాలి అందుకు సంబంధించిన విత్తనాలను కూడా సిద్ధం చేశామని తెలిపారు. వ్యవసాయ సలహా మండలి నియామకం పూర్తయిందని పేర్కొన్నారు.

వ్యవసాయ సలహా మండలిలో రైతులను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. సలహా మండలితో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments