Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగాది కానుకగా మామిడి పండ్ల రైతులకు కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు: శుభవార్తను నిజం చేసిన మంత్రి మేకపాటి

ఉగాది కానుకగా మామిడి పండ్ల రైతులకు కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు: శుభవార్తను నిజం చేసిన మంత్రి మేకపాటి
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:50 IST)
ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ మామిడిపండ్ల  రైతులకు ప్రత్యేకంగా కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించారని పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.
 
సత్వరమే స్పందించి మామిడి పండ్ల సీజన్ దృష్ట్యా కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలును ఏర్పాటు చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి. ఆరేళ్ళ తర్వాత మళ్లీ పున:ప్రారంభం వెనుక మంత్రి మేకపాటి కృషికి ట్విట్టర్ వేదికగా ఎంపీ లావు కృష్ణదేవరాయలు అభినందనలు.
 
ఏపీలోని వేలాది మంది రైతులకు, వ్యాపారులకు భారీ లబ్ది. కృష్ణా జిల్లా నూజివీడు నుంచి నేరుగా ఢిల్లీలోని ఆదర్శనగర్‌కి మామిడిపండ్ల ఎగుమతి. వ్యాపారమాల ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే ఉద్యానపంటలను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వీలుగా మంత్రి మేకపాటి వినతికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం.
 
భారతదేశంలోని మామిడిపండ్ల ఉత్పత్తిలో 22 శాతం వాటా , 12 లక్షల అమెరికా డాలర్ల విలువైన ఎగుమతుల భాగస్వామ్యం ఏపీదేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు  గత నెల ఢిల్లీ పర్యటనలో వివరించిన మంత్రి మేకపాటి.
 
అధిక ఉత్పత్తి నేపథ్యంలో అరటిపండ్లు, టమోటా పండ్ల ఎగుమతులకు వీలుగా కిసాన్ రైళ్లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మరోసారి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి మేకపాటి. గత మార్చి 18న ఢిల్లీ పర్యటనలో కేంద్ర పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి కిసాన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కేటాయించాలని వినతిపత్రం సమర్పించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
 
ఏప్రిల్ 12వ తేదీ సోమవారం లాంఛనంగా ప్రారంభమైన  తొలి కిసాన్ రైల్ లో నూజివీడు నుంచి ఢిల్లీకి  220 టన్నుల మామిడిపండ్ల రవాణా. కేంద్ర ప్రభుత్వం స్పందనతో నిజమైన ఉగాది పండగొచ్చిందన్న మంత్రి మేకపాటి. ఈ సందర్భంగా రాష్ట్ర రైతులకు, ప్రజలకు..రైతు ప్రభుత్వం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల ప్రకారం... నో మాస్క్- నో పెట్రోల్...