Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 నెలల్లో ప్రభుత్వం సాధించింది 'పేదల ఆకలి కేకలు'

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (20:33 IST)
రాష్ట్రంలో పేదల ఆకలి కేకలపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన చెందారు. అన్నా క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా తెరిపించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

''కష్టపడి సంపాదించుకునే దారుల్ని ప్రభుత్వం మూసేస్తే, పనిలేక ఆకలి చల్లార్చుకోడానికి కొంతమంది కూలీలు ఆలయాల్లో అన్న ప్రసాదాల మీద ఆధారపడుతున్నారంటే బాధేస్తోంది. ఇంకొకచోట మెతుకుకోసం చెత్త కుప్పల్లో వెతుకుతున్న కూలీని తలచుకుంటే కళ్ళు చెమర్చుతున్నాయి.

ప్రజలకు ఇలాంటి దయనీయ పరిస్థితులు తెచ్చినందుకు వైసీపీ పాలకులు సిగ్గుపడాలి. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఇదేనా మీరు సాధించిన ఘనకార్యం? కనీసం అన్నక్యాంటీన్ ఉన్నా ఈ పరిస్థితిలో కూలీలను ఆదుకునేది. సాకులు చెప్పకుండా వెంటనే అన్నక్యాంటీన్ లను తెరిచి పేదలను ఆదుకోండి'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
 
అమ్మకానికి ఆంధ్రప్రదేశ్'
ప్రభుత్వం తీసుకున్న 'బిల్డ్ ఏపీ మిషన్' నిర్ణయంపై తెలుగుదేశం మండిపడింది. ఈ విధానంతో 'క్విడ్​ ప్రోకో'కు తెర లేపుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

రాష్ట్రంలో 'బిల్డ్ ఏపీ మిషన్' పేరుతో ప్రభుత్వం 'క్విడ్ ప్రోకో'కు తెర లేపుతుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. విజయవాడలో ప్రభుత్వ ఆస్తులు అమ్మితే సహించేది లేదన్నారు. సంపద సృష్టించేందుకు ఆస్తులమ్మే నిర్ణయాన్ని.... సర్కారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments