Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హాకీ పూర్వ వైభవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం: బిశ్వభూషణ్

హాకీ పూర్వ వైభవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం: బిశ్వభూషణ్
, సోమవారం, 4 నవంబరు 2019 (07:08 IST)
అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను తెచ్చి పెట్టిన హాకీ అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహకారాన్ని అందించాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. హాకీలో ఆసియా ఛాంపియన్‌షిప్ నుండి ఒలింపిక్స్ వరకు గర్వించదగిన విజయాలు మన సొంతమని ఈ క్ర‌మంలో ప్రభుత్వాలు హాకీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన హాకీ ఆంధ్రప్రదేశ్ ఐదవ వార్షికోత్సవం, రాష్ట్ర స్ధాయి హాకీ అవార్డుల వేడుకలో గౌరవ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 లో ఇండియాలోని గ్వాలియర్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ హాకీ ఫెడరేషన్ స్థాపించిన తరువాత 1928 నుండి ప్రపంచ హాకీ చిత్రపటంలో మనమే అధిపత్యం చెలాయిస్తూ వచ్చామని మాన్యశ్రీ గవర్నర్ గుర్తు చేసారు. 

ఆమ్ స్టర్ డామ్, లాస్ ఏంజిల్స్, బెర్లిన్, లండన్, హెల్సింకి, మెల్బోర్న్ ఇలా వరుస విజయవాలు మనవేనని, 1980 లో మాస్కో ఒలింపిక్స్ లో  భారత్ మళ్లీ బంగారు పతకం సాధించగా, ఆసియా, కామన్వెల్త్,  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఇలాంటి విజయాలు మనకు ఎన్నో లభించాయన్నారు.

హాకీని డి-ఫాక్టో నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం గుర్తించటమే కాక,  హాకీ దిగ్గజంగా పిలవబడే మేజర్ ధ్యాన్ చంద్ కు భారత ప్రభుత్వం "పద్మ విభూషణ్" గౌరవాన్ని ఇచ్చిందని,  ధ్యాన్ చంద్ భారత జట్టుకు నాయకత్వం వహించి 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి, భారత దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసాడని బిశ్వభూషన్ వివరించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో క్రమపద్ధతిలో, క్రమం తప్పకుండా, టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా హాకీ ఆంధ్రప్రదేశ్, హాకీ యొక్క ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేయటం ముధావహమన్నారు. మొత్తం ఆరు రాష్ట్ర హాకీ జట్లకు స్టేట్ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహించిన హాకీ ఆంధ్రప్రదేశ్ పలువురు ఆటగాళ్ళు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటేందుకు దోహదం చేసిందన్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఆస్ట్రో టర్ఫ్, ఆధునిక క్రీడా ప్రాంగణాలు,  సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహా హాకీ అకాడమీలు,  అత్యాధునిక మోళిక సదుపాయాల అవసరం ఉందని క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి రాష్ట్రం మొత్తం లో ఒక్క ఆస్ట్రో టర్ఫ్ కూడా కనిపించక పోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు.

పొరుగు రాష్ట్రం ఒడిశాలో ఎనిమిది మోడరన్ టర్ఫ్ హాకీ పిచ్‌లు, పది హాకీ అకాడమీలను ఉన్నాయని, అవి అక్కడ హాకీ ప్రోత్సహానికి ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర గవర్నర్‌గా తాను హాకీ క్రీడాకారులు, తమ ఆటను మెరుగుపరుచుకోవటానికి , జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడడటానికి వీలుగా రాష్ట్రంలో తగిన మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి సూచిస్తానన్నారు.

హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం హాకీ క్రీడాభివృద్దికి సంబంధించి పలు సమస్యలు చుట్టు ముట్టాయని వాటిని అధికమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

వనరుల కొరత మొదలు మోళిక వసతులతో సహా పలు అంశాలలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రి ఆశీస్సులతో రాష్ట్రం నుండి దేశ భవిష్యత్తు అవసరాలకు ఉపకరించే క్రీడాకారులను తయారు చేస్తామని ఈ సందర్భంగా మీనా హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్, అచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉప కులపతి అచార్య రామ్ జీ, రిజిస్ట్రార్ రోశయ్య, హాకీ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు ఎం. నిరంజన్ రెడ్డి, ఒలంపిక్ పతక విజేత సత్తి గీత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హకీ క్రీడాభివృద్దికి విశేష కృషి చేసిన క్రీడాకారులు, నిర్వాహకులను గవర్నర్ శాలువా, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది: రేవంత్ రెడ్డి