Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గడువు లోపు చేరకుంటే అంతే!: ప్రభుత్వం

Advertiesment
గడువు లోపు చేరకుంటే అంతే!: ప్రభుత్వం
, మంగళవారం, 5 నవంబరు 2019 (07:43 IST)
ఆర్టీసీ కార్మికులు తమ విధుల్లో చేరేందుకు ఇచ్చిన గడువు తీరిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేర్చుకోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రి ముగియనుంది.

ఆ తర్వాత కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా...లేక ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడమా అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన ఐదు వేల రూట్లలో కూడా ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తామని తెలిపింది. ప్రభుత్వం మరో ఐదు వేల ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తే ఇక రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదని వివరించింది.
 
ఆర్టీసీ కార్మిక సంఘాల సమాలోచనలు... వేర్వేరుగా సమావేశాలు
ఈనెల 5వతేదీలోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించినందున ఆర్టీసీ యూనియన్లు అప్రమత్తమయ్యాయి. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ ప్రణాళికపై టీఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ఎంయూ నేతలు వేర్వేరుగా హైదరాబాద్​లో సమావేశమై చర్చిస్తున్నారు.

ప్రభుత్వం విధించిన గడువు అర్థరాత్రికి ముగియనుంది. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ ప్రణాళికపై టీఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ఎంయూ యూనియన్లు వేర్వేరుగా హైదరాబాద్​లో సమావేశమయ్యాయి. కార్మికుల్లో మనోధైర్యం ఏవిధంగా నింపాలి, సమ్మెపై నెలకొన్న భిన్నాభిప్రాయాలు ఎలా నివృత్తి చేయాలనే అంశాలపై యూనియన్ల నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
 
ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరోమారు సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఇం​ఛార్జి ఎండీ సునీల్ శర్మ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆర్టీసీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్షించారు.

రవాణా శాఖ మంత్రి అజయ్, సీఎస్​ ఎస్​కే జోషి, ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ నెల 7న హైకోర్టులో ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై విచారణ ఉన్నందున... కోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ భవిష్యత్తు బలి తీసుకోవచ్చు: లోకేష్