Publish Date: Tue, 05 Nov 2019 (07:34 IST)
Updated Date: Tue, 05 Nov 2019 (07:35 IST)
గ్రామా సచివాలయ ఉద్యోగులుగా అర్హత సాధించినా పోస్టింగ్ ఇవ్వని కొందరు నిరుద్యోగులు సెల్ టవర్ ఎక్కి ప్రభుత్వంపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.
కాగా ఈ విషయంఫై ట్విట్టర్ ద్వారా స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ ‘@ysjagan గారి జమానాలో మీకెన్ని అర్హతలున్నా, గ్రామ వాలంటీర్ కావాలంటే వైకాపా వాళ్ళై ఉండాలి. గ్రామ సచివాలయం పోస్టు కొట్టాలంటే క్వశ్చన్ పేపర్ కొనాలి.
ఇవేమీ చేయకుండా టవరెక్కితే రాక్షస రాజ్యంలో ఉద్యోగాలొస్తాయా?, అసలు వైకాపా కలర్ వేయని టవర్ ఎందుకు ఎక్కారని మీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టొచ్చు. బాధ్యతలేని పాలకుడు మీ భవిష్యత్తు బలి తీసుకోవచ్చు. చలనం లేని దున్నపోతు ప్రభుత్వంలో కదలిక కోసం మీ జీవితాలను పణంగా పెట్టొద్దు’ అని ట్వీట్ చేశారు.