Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓర్వలేకే వైకాపా సర్కారుపై చంద్రబాబు విమర్శలు : శ్రీకాంత్ రెడ్డి

ఓర్వలేకే వైకాపా సర్కారుపై చంద్రబాబు విమర్శలు : శ్రీకాంత్ రెడ్డి
, శనివారం, 5 అక్టోబరు 2019 (15:53 IST)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకే విమర్శలు గుప్పిస్తున్నారని ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలు వస్తున్నాయని 2 నెలల ముందు ఓట్లకోసం పథకాలు తెచ్చిన చరిత్ర చంద్రబాబుది.
 
ఎన్నికలలో చేసిన వాగ్దానాలను నాలుగు నెలల్లోనే అమలు చేస్తున్న ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డిది. 
నీ నిర్వాహకం వల్ల జరిగిన కోడెల ఆత్మహత్యను సైతం రాజకీయం చేసే క్రమంలో విక్టరీ సింబల్ చూపిస్తూ దొరికిపోయిన చంద్రబాబు. ఆటోడ్రైవర్లకు ఏ ప్రదేశంలో పదివేలు ఇస్తానని వాగ్దానం చేశారో వైయస్ జగన్ అదే ప్రదేశంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. 
 
వాహనమిత్ర పథకాన్ని సైతం సిగ్గులేకుండా విమర్శిస్తున్నారు. పథకాలలో లోపాలు ఉంటే చెప్పాలి. అంతేగాని ప్రతివిషయంపై చంద్రబాబు బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో వందలాది దేవాలయాలను కూలగొట్టి కనకదుర్గ, శ్రీకాళహస్తి ఆలయాలలో క్షుద్రపూజలు చేయించిన నైజం చంద్రబాబుది. సదావర్తి భూములు కాజేసేందుకు ప్రయత్నించి కోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంది నీవు కాదాయా. 
 
శ్రీవారి ఆలయంలో పోటును తవ్వించింది చంద్రబాబు హయాంలోనే. కనకదుర్గమ్మ ఆలయంలో కిరీటం పోయింది కూడా బాబు హయాంలోనే. వైయస్ జగన్ ఆలయ మర్యాదలు పాటిస్తూ హిందూసంప్రదాయాలను గౌరవిస్తూ శ్రీవారి ఆలయంలోనూ, కనకదుర్గమ్మఆలయంలోనూ పట్టువస్త్రాలు సమర్పిస్తే అందులోనూ రాజకీయమేనా? రైతులను, నిరుద్యోగులను, డ్వాక్రామహిళలను ఇలా అందర్ని మోసం చేశావు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ చిత్తశుద్దితో పరిపాలన చేస్తుంటే ఓర్వలేక కుళ్లుకుంటున్నావు. సోషల్ మీడియాలో నీవు చేసిన దుర్మార్గాలు దేశంలో ఎవరూ చేసివుండరు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ను ఏడిపించి చంపించావు. లక్ష్మీపార్వతిని మహిళ అని కూడా చూడకుండా నీచంగా వేధించావు. జూనియర్ ఎన్టీఆర్‌ను సైతం వాడుకుని వదిలేశావు.
 
వైయస్ జగన్ కుటుంబంపైన, వైయస్సార్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపైన సోషల్ మీడియాలో చేసిన దుర్మార్గాలు ప్రజలు మరిచిపోలేదు. పోలీసు వ్యవస్థను ఎంతలా దిగజార్చి పాలన సాగించావు. జగన్ పాలనలో నిష్పక్షపాతంగా పనిచేస్తుంటే విమర్శిస్తున్నావు. నీలా మేం ఆలోచిస్తే మీ అరాచకాలను బయటకు తీస్తే టిడిపి నేతలందరూ జైళ్లలో ఉంటారు.
 
నిరుద్యోగులకు ఇచ్చిన హామ మేరకు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలకుపైగా కల్పించిన ఘనత వైయస్ జగన్ గారిది. చంద్రబాబు నీ వైఖరి మార్చుకో లేదంటే మరింత అధోగతి పాలు కాకతప్పదు. వైయస్ జగన్‌కి రాసిన లేఖలో తన నియోజకవర్గానికి సంబంధించిన ఓబులేసు అనే మోసగాడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంబంధించి నీవు వెనకేసుకువస్తూ మాట్లాడి నీ స్థాయిని దిగజార్చుకున్నావు అంటూ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడిపై 200 మంది ప్రియురాలి బంధువుల దాడి, కత్తులు-రాడ్లతో విధ్వంసం.. ఎక్కడ?