Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలా?..చంద్రబాబు అగ్రహం

గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలా?..చంద్రబాబు అగ్రహం
, బుధవారం, 2 అక్టోబరు 2019 (15:15 IST)
గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు నిర్వహించడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి మద్యం అమ్మిస్తూ గాంధీ జయంతి రోజున ఎలాంటి సందేశాలు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్‌ వ్యవహారశైలి ఉందని, రాష్ట్రం జగన్‌ జాగీరు కాదని అన్నారు. బ్రిటీష్‌ వారైనా చట్టాన్ని అనుసరించేవారని, జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లను మూసేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాలను 2003లోనే ప్రారంభించామని, ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 11 అవినీతి కేసులున్న వ్యక్తి నీతిమంతుడిలా చెలామణి అవుతున్నారని అన్నారు.

ప్రజలంతా అవినీతిపరులని తానొక్కడే నీతివంతుడినని జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చట్టాన్ని చుట్టంగా చేసుకుని ప్రజలకు శిక్షగా మారుస్తున్నారని. చిన్నాన్నని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఎందుకని అగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో బీజేపీ సర్కారు పతనం : కుమార స్వామి జోస్యం