చిత్తూరు జిల్లాలో ప్రేమ జంటపై కత్తులు, గొడ్డళ్ళతో దాడికి యత్నించారు. ఏర్పేడు హరిజనవాడకు చెందిన మహేష్, గొల్లపల్లికి చెందిన స్నేహలు నిన్న వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి వీరి వివాహం జరిగింది. మహేష్‌తో వివాహం జరగడం స్నేహ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. వివాహం చేసుకున్న తరువాత పోలీసులను ఆశ్రయించారు. స్నేహ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.
స్నేహను మహేష్‌తో పంపించేశారు. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన స్నేహ కుటుంబ సభ్యులు మహేష్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మహేష్, స్నేహలపై కత్తులతో దాడికి యత్నించారు.
మహేష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిని అడ్డుకున్నారు. మహేష్ అన్నతో పాటు వారి ఇద్దరు బంధువులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తమకు ప్రాణ హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాని మహేష్, స్నేహలు కోరుతున్నారు.