Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితురాలు తన ప్రియుడితో కలిసి ఉండటం చూడలేక సైకోగా మారింది, ఆ తర్వాత?

Advertiesment
girlfriend
, గురువారం, 26 సెప్టెంబరు 2019 (16:11 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో విపరీతంగా క్రైం రేటు పెరిగిపోతోంది. అందులోను యుక్తవయస్సు వారే ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ జీవితాన్ని సగంలోనే నాశనం చేసేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 
విజయవాడకు చెందిన ప్రియ హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం వచ్చింది. ఎం.టెక్ పూర్తి చేసిన ఆమె హిమాయత్ నగర్ సమీపంలో ఒక లేడీస్ హాస్టల్లో ఉండేది. ఆ హాస్టల్ ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతూ వచ్చింది. అయితే ఆమెకు ఉద్యోగం దొరకలేదు. హాస్టల్ ఎదురుగా ఉన్న యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.
 
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో హాస్టల్ గదిని ఖాళీ చేసి అతడి గదిలోకి షిప్ట్ అయిపోయింది ప్రియ. విషయాన్ని తల్లిదండ్రులకు మాత్రం చెప్పలేదు. ఇలా రెండునెలల పాటు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం సాగింది. విజయవాడకు చెందిన ప్రియ స్నేహితురాలు మృదుల ఉద్యోగం కోసం హైదరాబాద్‌కే వచ్చింది.
 
తన స్నేహితురాలు ప్రియకు మృదుల ఫోన్ చేస్తే తన గదికి రమ్మంది. అయితే హాస్టల్లో కాకుండా ప్రియ మరో యువకుడి గదిలో ఉండడంతో ఆశ్చర్యపోయింది మృదుల. ప్రియ రిక్వెస్ట్‌తో తనూ ఆ గదిలోనే వుండేందుకు అంగీకరించింది. అయితే ప్రియ ఆ యువకుడితో బాగా చనువుగా వుండటాన్ని తట్టుకోలేకపోయింది మృదుల. అతడిని తన లైన్లోకి తేవాలని ప్రయత్నించి విఫలమైంది. దీంతో వారిని చూస్తూ ఓర్వలేకపోయింది.
 
ఇద్దరి మధ్యా ఎలాగైనా గ్యాప్ తీసుకురావాలని నిర్ణయించుకుంది. ప్రియకు మెల్లగా జాబ్ ట్రైలర్స్ వేయమని చెప్పింది. ఆమెకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉదయం పూట ఉద్యోగం. యువకుడికి రాత్రిపూట ఉద్యోగం. దీంతో ఇద్దరు కలవడం కష్టమైంది. అంతేకాదు గదికి ప్రియ ఆలస్యంగా వస్తుండటంతో ఆ యువకుడికి అనుమానం వచ్చేది.
 
ప్రియ తను చేయిదాటిపోతుందేమోనని అనుమానాన్ని ఆ యువకుడికి కలిగేలా పెద్దది చేసి చెప్పే ప్రయత్నం చేసేది ప్రియ. ఇంకేముంది ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగింది. ప్రియ గదిని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ప్రియ అలా వెళ్లిపోవడంతో ఆ యువకుడు మద్యానికి బానిసయ్యాడు. అదే అదనుగా ఆ యువకుడిని మెల్లగా తనవైపు తిప్పుకుంది మృదుల. తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ప్రియకు పంపేది. దీంతో ప్రియ ఆ యువకుడిపైన కోపం పెంచుకుంది. ఓ రోజు రహస్యంగా ఆ యువకుడి గదికి వచ్చి అతడిని అతి దారుణంగా చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలు ప్రియను అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హికా సైక్లోన్.. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..!