Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలోని అన్ని సర్కార్​ బడుల్లో ఆంగ్లమాధ్యమం

Advertiesment
రాష్ట్రంలోని అన్ని సర్కార్​ బడుల్లో ఆంగ్లమాధ్యమం
, బుధవారం, 6 నవంబరు 2019 (08:22 IST)
విద్యారంగంలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని పాఠశాలల్లో తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మండల, జిల్లా పరిషత్ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మొదటగా 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021-2022 విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు 15
మార్చి 2020లో జరిగే ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుమూ లేకుండా ఈ నెల 15 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.

రూ.120ల ఆలస్య రుసుముతో ఈ నెల 22 వరకు, రూ.500ల ఆలస్య రుసుముతో డిసెంబరు 4 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబరు 16 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో డిసెంబరు 30 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో జనవరి 9 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో జనవరి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు?