Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రైతులకు మరో శుభవార్త... పసుపు-కుంకుమ మూడో చెక్కు కూడా...

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:15 IST)
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈ విడత రుణమాఫీ కోసం రూ.3,900 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన మీడియాకు చెప్పారు. దీనితో 30 లక్షలకు పైగా రైతులకు వారి ఖాతాల్లో 39 వేల రూపాయల చొప్పున జమ చేసినట్లు చెప్పారు.
 
రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. ఏడాదికి 10 శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. అన్నదాతా సుఖీభవ నిధులు కూడా ఖరీఫ్‌లోగా ఇస్తామన్నారు. మే 23 లోపు ఐదో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబరావు అన్నారు. మరోవైపు పసుపు కుంకుమ 3వ చెక్కు సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని కూడా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments