నెలకు రూ.55 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3000 పింఛన్.. ఎలాగంటే?

సోమవారం, 25 మార్చి 2019 (19:23 IST)
వృద్ధాప్యంలో చాలామంది ఆసరా లేక ఇబ్బందులు పడటాన్ని మనం చాలాచోట్ల చూస్తుంటాం. ఐతే కేంద్రం ప్రవేశపెట్టిన పీఎంఎస్‌వైఎం... ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ ద్వారా 60 ఏళ్ల తర్వాత పింఛన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో కార్మికులు, ప్రభుత్వం తమవంతు వాటాగా నెలవారీ రూ. 100 చొప్పున పింఛన్ ఖాతాలో జమ చేయాల్సి వుంటుంది. అలా జమ చేస్తూ వచ్చినవారు 60 ఏళ్లు నిండిన తర్వాత వారికి నెలకి రూ. 3000 చొప్పున పింఛన్ అందిస్తారు.
 
ఈ పథకంలో అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు 29 ఏళ్లకు చేరవచ్చు. ఇలా చేరినవారు నెలకి రూ. 100 చెల్లిస్తూ వస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి నెలకి రూ. 3000 చొప్పున అందుతుంది. ఐతే 18 ఏళ్ల వయసులోనే చేరేవారికి కట్టాల్సిన సొమ్ము తగ్గుతుంది. ఈ వయసులో చేరిన వారు రూ. 55 చెల్లిస్తే చాలు. ఇలా వారు కూడా 60 ఏళ్ల వరకూ చెల్లించినట్లయితే రిటైర్మెంట్ వయసులో నెలకి రూ. 3000 పొందవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలో 10 కోట్లమంది ప్రయోజనం పొందే అవకాశం వుంటుంది కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. 
 
ఈ పథకంలో ఎవరు చేరవచ్చు...
1. అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు.
2. ఇందులో చేరేవారి వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వుండాలి.
3. నెలసరి ఆదాయం కనీసం రూ. 15000కి తగ్గకుండా వుండాలి.
 
అవసరమైన పత్రాలు:
1. ఆధార్ కార్డ్
2. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా / జన్ ధన్ ఖాతా
3. ఖచ్చితమైన మొబైల్ నెంబరు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వంటిపై నూలుపోగు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాడు.. ఆ తర్వాత ఏమైంది?