అగ్రిగోల్డ్ బాధితులకు అదిరిపోయే శుభవార్త...
అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వందలమంది ఆత్మహత్యలు, మరికొంతమందికి మానసిక క్షోభ. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. అగ్రిగోల్డ్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయినాసరే అగ్రిగోల్డ్ బాధితుల్
అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వందలమంది ఆత్మహత్యలు, మరికొంతమందికి మానసిక క్షోభ. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. అగ్రిగోల్డ్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అయినాసరే అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ మాత్రం నమ్మకం లేదు. తాజాగా ఎస్సెల్ గ్రూప్ సంస్ధ అగ్రిగోల్డ్ ఆస్తులను కొనేందుకు ముందుకు వచ్చింది. దీంతో బాధితుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ పూర్తయి బాధితులను న్యాయం జరుగుతుందా లేదా అన్నది మాత్రమే అనుమానమే. ఎందుకంటే, ఇప్పటికే న్యాయపరిధిలో ఆస్తుల వ్యవహారం ఉంది కాబట్టి.
4వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు సుభాష్ చంద్ర గ్రూప్ ఆశక్తి చూపుతోంది. హైకోర్టులో అఫిడివిట్ దాఖలు చేసింది ఎస్సెల్ గ్రూప్. కొనుగోలు ప్రక్రియను నాలుగేళ్ళలో పూర్తి చేస్తామని చెప్పింది ఎస్సెల్ గ్రూప్. తదుపరి విచారణ ఈనెల 17వతేదీకి వాయిదా వేసింది. హైకోర్టు అభిప్రాయాలు తెలపాలని అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఇదే పూర్తిస్థాయిలో జరిగితే ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.