Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని కూడా చంపేస్తారు.. ప్రాణాలు కాపాడండి.. : వివేకా కుమార్తె లేఖ

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:14 IST)
తమను కూడా చంపేస్తారన్న భయం వెంటాడుతుందని, అందువల్ల తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కోరారు. ఈ మేరకు ఈమె కడప ఎంపీ అన్బురాజ్‌కు ఓ లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని లేఖలో కోరారు. 
 
ఈనెల 10న పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని తన లేఖలో గుర్తుచేశారు. మణికంఠ రెడ్డి వైకాపా నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి అనుచరుడిగా ఆమె వివరించారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని, ఇప్పుడు అతని అనుచరుడు రెక్కీ నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె లేఖలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ అధికారులకు సునీత లేఖలు పంపారు. లేఖతో పాటు సీసీ కెమెరా దృశ్యాల పెన్‌డ్రైవ్‌లు కూడా పంపినట్లు లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments