Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా వంశీప్రియారెడ్డి

దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా వంశీప్రియారెడ్డి
, బుధవారం, 7 జులై 2021 (14:34 IST)
Vamsee priya Reddy
దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్, సంగారెడ్డి అధ్యక్షురాలిగా మహిళా సాధికారతకు నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ జర్నలిస్ట్  కె.వంశీప్రియారెడ్డి నియమితులయ్యారు.  
 
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి 2007లో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం పూర్తిచేశారు. అదే ఏడాది తేజ టీవీలో చేరారు. ఆ  తర్వాత సాక్షి టీవీ, వనితటీవీ, మోజో టీవీలలో వివిధ రకాల బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుంచి ప్రజాటైమ్స్ అనే వెబ్ సైట్, దర్శనం లైవ్, వసుధ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ పనిచేసినా స్త్రీలకు సంబంధించిన అంశాలపై కార్యక్రమాలు రూపొందించడంలో ముందుంటారు. 
 
అలా స్త్రీల సమస్యలపై చేసిన ఎన్నో స్టోరీలకు, చర్చా కథనాలకు యూనిసెఫ్.. లాడ్లి, ఎన్టీవీ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా స్త్రీల కోసమే ‘వసుధ టీవీ’ నడుపుతూ మహిళా సాధికారతకు అహర్నిశలు కృషిచేస్తున్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలపట్ల చూపుతున్న భేదభావం మానవ ప్రగతికి విఘాతం కలిగిస్తుంది. 
 
అలా వివక్షకు గురవుతున్న మహిళలకు చేయూతనందిస్తూ అండగా నిలుస్తోంది దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్. ఇలాంటి ఫౌండేషన్ కు స్త్రీల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వంశీప్రియారెడ్డిని అధ్యక్షులుగా నియమించడం పట్ల పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. 
webdunia
Vamsee priya Reddy
 
ప్రతి మహిళా నిర్భయంగా అన్నీ రంగాలల్లో రాణించిన్నప్పుడే స్త్రీకి నిజమైన స్వేచ్ఛ ఉన్నట్లని అన్నారు వంశీప్రియారెడ్డి. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను, అవకాశాన్ని కల్పించిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మెన్ బి. వెంకటేశ్వర్ రాజు గారికి మరియు జాతీయ ఉపాధ్యక్షురాలు కళ్యాణి గారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ ఎక్కువగా తినేవాళ్ళు ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే?