Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి చేసుకుంటానని నాలుగు నెలలు సహజీవనం, కట్నం అధికంగా వస్తోందనీ?

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (19:35 IST)
పెద్దలను తీసుకుని పెళ్ళి చూపులకు వచ్చాడు. అమ్మాయి నచ్చిందంటూ పెళ్ళికి ఒకే అన్నాడు. అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను బెంగుళూరుకు తీసుకెళ్ళాడు. నాలుగు నెలలు సహజీవనం చేశాడు. ఆ తరువాత యువతిని ఇంటికి పంపించేశాడు. మంచి ముహూర్తం చూసుకుని పెళ్ళి చేసుకుందామని చెప్పాడు. అయితే ఆ తరువాత కట్నం ఎక్కువ వస్తుందని ఆశపడ్డాడు. ఇంకేముంది ఆ యువతికి హ్యాండిచ్చాడు. లబోదిబోమంటూ ఆ యువతి రోడ్డెక్కింది.
 
పీలేరు మండలం రేగళ్ళు పంచాయతీ నగరి గ్రామంలో రేగళ్ళు గ్రామానికి చెందిన మణికంఠ అనే యువకుడు తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న ఓ యువతిని నాలుగు నెలల క్రితం పెళ్ళి చూపులు చూశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఆమెను పెళ్ళిచేసుకుంటానని బెంగుళూరుకు తీసుకెళ్ళాడు.
 
కొన్నిరోజుల పాటు అక్కడే సహజీవనం చేశాడు. యువతి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబం కావడంతో ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ప్రస్తుతం తనతో పాటు బెంగుళూరులో పనిచేసే మరొక యువతిని పెళ్ళాడేందుకు సిద్థమయ్యాడు మణికంఠ. ఎక్కువ కట్నం వస్తుందని ఆశపడ్డాడు. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న యువతి పీలేరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రోడ్డుపై బైఠాయించి న్యాయం కావాలంటూ రాస్తారోకో నిర్వహించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments