Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త తెచ్చే జీతం సరిపోక పక్కింటి కుర్రాడితో వివాహేతర సంబంధం, భర్తకి తెలిసి...

Advertiesment
newly married wife
, శనివారం, 7 డిశెంబరు 2019 (15:40 IST)
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. కొంతమంది కొత్తగా పెళ్ళయిన జంటలు కూడా తమ భాగస్వామి ప్రవర్తన ఇష్టం లేకపోతే వెంటనే పెడదారి పడుతున్నారు. వందేళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు. అలాంటి ఘటనే కడప జిల్లాలో చోటుచేసుకుంది.
 
కడప జిల్లాలోని రాంనగర్ కాలనీ అది. గౌరి, అనంత్‌లకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అనంత్ స్థానికంగా ప్లంబర్‌గా పనిచేసేవాడు. గౌరి ఇంటి దగ్గరే ఉండేది. అనంత్‌కు సొంత ఇల్లు ఉంది. దీంతో తనకు వచ్చే డబ్బులతో ఇద్దరూ ప్రశాంతంగానే ఉండేవారు. 
 
అనంత్ ఉన్న ఇంటిలో మిద్దెపైన ఖాళీగా ఉండేది. చిన్న పెంట్ హౌస్ కావడంతో బ్యాచ్‌లర్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. క్రిష్ణ అనే యువకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆ ప్రాంతంలో ఇంటి కోసం తిరుగుతూ అనంత్ ఇంటి వద్ద టు-లెట్ బోర్డు చూసి వచ్చి ఇంటిలో చేరాడు. 
 
క్రిష్ణకు అప్పటికే కారు ఉంది. రియల్ ఎస్టేట్‌లో బాగానే సంపాదించాడు. తన స్నేహితుడికి చెందిన 50 ఎకరాల భూమి కడప నగరం చుట్టుప్రక్కల ఉండటం, అందులో 25 ఎకరాలను అమ్మాలని స్నేహితుడు నిర్ణయించుకోవడంతో వాటిని విక్రయించేందుకు క్రిష్ణ అక్కడకు వచ్చాడు. 
 
నాలుగు, ఐదు నెలలు మాత్రమే తాను ఇక్కడ ఉంటానని అనంత్‌కు చెప్పి ఇంటి అడ్వాన్స్ ఇచ్చి అక్కడికి వచ్చి చేరిపోయాడు. క్రిష్ణ డ్రెస్, స్టైల్, కారు, హుందాతనం చూసిన గౌరి అతని మోజులో పడిపోయింది. ప్లంబర్‌గా పని చేస్తున్న భర్త తెచ్చే డబ్బులు ఇంటి ఖర్చులకు మాత్రమే సరిపోతుండటం, కావాల్సిన వస్తువులు భర్త కొనివ్వకపోవడంతో క్రిష్ణతో పరిచయం పెంచుకుంది గౌరి.
 
ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త పనికి వెళ్ళిందే తడవుగా మేడ మీదకు వెళ్ళి క్రిష్ణతో కలిసి తన సంబంధాన్ని సాగించేది. తనకు కావాల్సిన వాటిని క్రిష్ణ కొనిచ్చేవాడు. అయితే గౌరిలో మార్పు కనిపించడం.. ఇంట్లో కొత్తకొత్త సామానులు వస్తుండటంతో అనంత్‌కు అనుమానం వచ్చింది. తనపై భర్తకు అనుమానం వచ్చిందని తెలుసుకున్న గౌరి ఎలాగైనా అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. రెండు రోజుల క్రితం ప్రియుడు క్రిష్ణతో కలిసి నిద్రిస్తున్న అనంత్‌ను ఊపిరాడకుండా ముఖానికి దిండును అడ్డం పెట్టి చంపేసింది. 
 
హత్య చేసి ఏమీ ఎరుగనట్లు గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అనంత్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్‌మార్టం చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక పెట్టుబడులు పెట్టలేం.. కంపెనీని మూసివేయాల్సిందే.. వొడాఫోన్