Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణాసంచా త‌యారీ కేంద్రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాలి.. జ‌గ‌న్ ఆదేశాలు

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (19:05 IST)
తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆరా తీశార‌ని, గడ‌చిన 20 రోజుల్లో 2 ప్రమాదాలు జరగడంపై సీఎం జ‌గ‌న్ చర్చించిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు.

శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాణాసంచా తయారీ కేంద్రాల్లో వెంటనే తనిఖీలు చేయాలని సీఎం ఆదేశాలిచ్చార‌ని పేర్కొన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో లోపాలు ఉంటే వెంటనే సీజ్ చేయాలని, వేమవరం ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకోవాలని అలాగే బాణసంచా తయారీ కేంద్రాల్లో అనుమతులపై ఫైర్, పోలీస్ శాఖ‌లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సీఎం ఆదేశించిన‌ట్లు తెలిపారు.

ప్ర‌భుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లోపాలు ఉన్నా ఉపేక్షించేది లేద‌న్నారు. దీపావళి పండ‌గ నేపథ్యంలో బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, అమ్మకాల వద్ద భద్రతా ప్రమాణాలపై నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించామ‌న్నారు.

శుక్ర‌వారం జ‌రిగిన ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంద‌ని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments