Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పత్రికా స్వేచ్ఛపై మట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.. ధర్మాన

Advertiesment
పత్రికా స్వేచ్ఛపై మట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.. ధర్మాన
, శనివారం, 19 అక్టోబరు 2019 (18:40 IST)
ఏపీలో వైయస్‌ఆర్‌సీపీ 4 నెలల పాలనపై ప్రతిపక్షమైన టీడీపీ, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న మీడియా తాబేదార్లు, సహచరులు కొంతమంది పత్రికా స్వేచ్ఛ నశించిపోయిందని మాట్లాడుతుండటంపై పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు స్పందించారు.

ముందు ఈ విషయంలో చంద్రబాబుకు మాట్లాడే నైతిక హక్కు లేదని ధర్మాన మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన ఐదేళ్లు చంద్రబాబు పరిపాలన చూశామన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక చట్టాల్ని మోసగించి .. కోర్టులకు దొరకకుండా ఎత్తుగడులతో నైతికతలేని ప్రజాధనాన్ని అన్నివిధాలుగా చంద్రబాబు దోపిడీ చేశారని ధర్మాన అన్నారు.

చంద్రబాబు తన తాబేదార్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టారు. చంద్రబాబుకు అనుకూలమైన సంస్థలు అన్నింటికీ ప్రజాధనం దోచిపెట్టారన్నది బహిరంగ రహస్యమని ధర్మాన మండిపడ్డారు. 
 
ఈ సందర్భంగా ధర్మాన మీడియాతో ఏమన్నారంటే...
మీడియాను అడ్డంపెట్టుకొని చాలా మందితో చంద్రబాబు ఆడుకున్నారు. రాజకీయంగా పతనం అయ్యేలా చంద్రబాబే వ్యవహరించారు. బాబు పాలన అద్భుతం అని మీడియా రాసినా ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబు ఎప్పుడూ తనకు అనుకూలంగా ఉండే పత్రికలను అడ్డంపెట్టుకొని అనేక మంది జీవితాలతో ఆడుకొన్నారు.

గత ఐదేళ్లలో కొంతమందిని రాజకీయంగా పతనం చేసే పని కూడా చేశారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రాజకీయ పార్టీలను కూడా సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు బలవంతులు, విజ్ఞులు కాబట్టే కొన్ని దొంగ వార్తలు రాయటం వల్ల ప్రజాభిప్రాయం మార్చలేమని ఈ ఎన్నికల్లో రుజువైందన్నారు.  
 
పాలనపై చంద్రబాబు జోస్యం చెప్పటం ఏంటి? చంద్రబాబు పాలనను ఎదుటివారిపై రుద్దటం ఏంటి? ప్రజాస్వామ్యంపై చంద్రబాబు మాట్లాడటమా?  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి చంద్రబాబుకు తెల్సు.

అయితే... వచ్చే నాలుగేళ్ల పరిపాలనను చంద్రబాబు ఇప్పుడే చెప్పేయటం ఏంటని ధర్మాన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును ధర్మాన నిలదీశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్ఛ హరించుపోయిందని, బీహార్‌లా రాష్ట్రం తయారైందని, గూండాయిజం కొనసాగుతోందని చంద్రబాబు మాట్లాడటంపై ధర్మాన మండిపడ్డారు. 
 
ఒక్కసారైనా చంద్రబాబు తన పరిపాలన ఎలా సాగిందో చూసుకున్నారా? ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందో, ఎన్నో వ్యవస్థలు నాశనం చేశారన్నారు. వీటిని సరిదిద్దటానికి కొంత సమయం పడుతుందని చాలా కాలం క్రితమే తను చెప్పానని ధర్మాన గుర్తు చేశారు.

వ్యవస్థల్ని పాడుచేసి చంద్రబాబు పరిపాలన చేశారు. చంద్రబాబు తన చుట్టూ తిరిగే వారికోసం ఎన్నో అక్రమాలు చేశారని ధర్మాన మండిపడ్డారు. అమరావతి డిజైన్స్‌ కోసం వచ్చిన ఓ జపాన్‌ సంస్థ మాకీ - చంద్రబాబు అవినీతిని చెప్పిందన్నారు. బీహార్‌లో ఓ కార్యక్రమం చేశామని అది ఏపీ కంటే ఎంతో మెరుగ్గా ఉందని ఆ సంస్థ లేఖలో తెలిపిందని ధర్మాన అన్నారు.

ఇక్కడ పూర్తిగా అన్ని పద్ధతులు నాశనం చేసి స్వార్థపూరిత పాలన జరుగుతోందని జపాన్‌ ఆర్కిటెక్‌ మాకీ చెప్పటం జరిగింది. మాకీ సంస్థ చెప్పిన తర్వాతే బీహార్‌ కంటే అధ్వాన్నమైన పాలన చంద్రబాబు హయాంలో ఏపీలో జరిగిందని అందరికీ అర్థమైందని ఆయన వివరించారు. 
 
ఎన్ని వార్తలు చంద్రబాబుకు అనుకూలంగా రాసినా ఎన్ని పొగడ్తలు చేయించుకున్నా ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని ధర్మాన అన్నారు. కాంట్రాక్టులు కూడా ఏవైతే డబ్బులు వస్తాయో వాటిని గుర్తించి కాంట్రాక్టు తయారు చేసే వ్యక్తే వందలాది కోట్లు ధరలను నిర్ణయించారన్నారు. కాంట్రాక్టర్‌ సంపాదించిన డబ్బు నుంచి చంద్రబాబు అండ్‌ కో వాటాలు పొందటం వంటి కార్యక్రమాలు చేశారు. ఇదే కదా గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందని ధర్మాన చెప్పారు. 
 
ఈరోజు రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌ అయినా జ్యుడిషియరీ స్ర్కూటినీకి వెళ్లాలనే చట్టాన్ని తెచ్చి జ్యుడిషయల్‌ ఫోరం ఏర్పాటు చేసిన ప్రభుత్వం శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ గారిది. దీనికి ఎంతో ధైర్యం కావాలి. మీకు గట్స్‌ ఉన్నాయా అని చంద్రబాబును నిలదీశారు. అన్నీ సర్వనాశనం చేశారు.

ఆఖరికి చెట్టని, పుట్టని, గట్టని ప్రభుత్వ నిధులు కొల్లగొట్టారు. ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడం మా సర్వహక్కు అన్నట్లు ఆనాడు వ్యవహరించారు. ఏ ఒక్క ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. 
 
పత్రికా స్వేచ్ఛ హరించామట. ఈ నాలుగు నెలల్లో ప్రభుత్వం అదనంగా ఉత్తర్వులు జారీ చేసిందా? పత్రికా మిత్రుల పైన కేసులు వేసిందా? ఎక్కడ హరించివేయటం జరిగిందండీ. మీరు చెప్పండి.. మీరు ఏం చెబితే అది రాసే పత్రికల్లో రాయించి అందర్నీ నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. 

గత ప్రభుత్వంలో చంద్రబాబు మీడియాపై చర్యలు తీసుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటానికి పనికట్టుకొని మీరు పెట్టుబడిపెట్టిన ఆర్థిక సహకారం అందిస్తున్న వ్యక్తులు వార్తలు రాయగలరు కాబట్టి ప్రజల్ని నమ్మగించగలరు కాబట్టి వాస్తవాలను ప్రజలు తెలియజేయటానికి ప్రభుత్వం చేయాలి కదా అని ధర్మాన ప్రశ్నించారు.

ఉన్న చట్టాల్లో వాస్తవాలు ఏమిటో తెలియజేయటానికి కోర్టుల ముందు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టమా? నిర్ణయాలా? ఒక్క సంఘటను అయినా చూపించగలరా చంద్రబాబు అని ధర్మాన ప్రశ్నించారు.  
 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కానీ, శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పత్రికాస్వేచ్ఛ మీద నమ్మకం ఉంది కాబట్టే ఆయన గెలిచారు. అనేక వందలాది పత్రికలు వాస్తవాలు బయటకు తెచ్చాయి కాబట్టే ఆయన ప్రభుత్వం విజయం సాధించింది. ఏ పత్రిక అయినా పనికట్టుకొని అవాస్తవాలు ప్రజల్లో చొప్పించాలని ప్రయత్నిస్తుందో ఈ దేశ రాజ్యాంగం ప్రకారం కోర్టుల పరిధిలో నిలబెడతామని చెప్పటం జరిగిందని ధర్మాన వివరించారు.

అంతేకానీ పత్రికా స్వేచ్ఛను అణచివేయటానికి, పీక నొక్కటానికి చట్టాన్ని తేవటం, ప్రభుత్వ ఉత్తర్వులు ఏమీ విడుదల చేయలేదన్నారు. మీడియా ముసుగులో చంద్రబాబు చాలా మంది జీవితాలతో ఆడుకున్నారని ధర్మాన మండిపడ్డారు. అనేక మందిని పాతిపెట్టే పని కూడా చేయించారన్నారు. మీడియా ముసుగులోనే చంద్రబాబే సరదాగా చాలా మంది జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
గత ఐదేళ్లలో చంద్రబాబు ఎన్నో విషయాల్లో వైఫల్యం చెందారు. ఒకటా, రెండా.. ఎన్నో అంశాలున్నాయని ధర్మాన అన్నారు. అంతెందుకు.. చంద్రబాబు హయాంలో పోలీస్‌ స్టేషన్లు ఎలా పనిచేశాయని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీ వాళ్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారంటే కేసులు రిజిష్టర్‌ చేసేవారు కాదని ధర్మాన గుర్తు చేశారు.

చివరకు ఆనాడు దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే చంద్రబాబు పిలిచి మందలించే పని కూడా చేయలేదని ధర్మాన అన్నారు. నెల్లూరులో మా పార్టీ ఎమ్మెల్యే ఓ ఎంపీడీఓను దుర్భాషలాడారని కంప్లైంట్‌ ఇస్తే వైయస్‌ జగన్‌ గారు చట్టం తనపని తాను చేసుకొని వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు ఇచ్చారు.

ఈ అంశాన్ని కనీసం చంద్రబాబు తన పరిపాలనతో పోల్చి చూసుకున్నారా? కనీసం ఇలా ఎప్పుడైనా బేరీజు వేసుకున్నావా చంద్రబాబూ అని ధర్మాన ప్రశ్నించారు. నిన్నగాక మొన్న పబ్లిక్‌ కమీషన్‌ ఎగ్జామ్‌కు వెళ్లినప్పుడు ఇంటర్య్వూల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తే ఇకపై ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు ఉండవని  వైయస్‌ జగన్‌ చెప్పారు. తద్వారా సీఎం జగన్‌ నిజాయితీ కనిపించటం లేదా చంద్రబాబూ అని ధర్మాన ప్రశ్నించారు. 
 
ఐదేళ్లలో చంద్రబాబు నిజాయితీగా చేసిన ఒక్క నిర్ణయమైనా చెప్పగలరా? 15ఏళ్లలో ఎంతో మందిని ఎంపీలుగా రాజ్యసభకు చంద్రబాబు పంపించారు. ఏనాడైనా వాళ్లలో ఒక్క షెడ్యూల్ క్యాస్ట్‌ నుంచి కానీ, మైనార్టీ నుంచి పంపించారా? ఎవరు డబ్బు మూటలు ఇస్తే వారిని పంపించారు.

మరి, మీరు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని గొప్పలు చెప్పుకొంటున్నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి వాళ్ల వల్లనే సమాజంలో ఇన్ని వ్యత్యాసాలు వచ్చాయని ధర్మాన అన్నారు.
 
ఒరిస్సాలో నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రి ఉన్నారు. అక్కడ నిజాయితీ పరిపాలన జరుగుతోంది. కేరళలో నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రి ఉన్నారు. కమ్యూనిస్టుల ప్రాంతాల్లో నిజాయితీగా పాలన జరుగుతోంది. ప.బెంగాల్, బీహార్‌లో, పంజాబ్‌లో నిజాయితీగా పాలన జరుగుతోంది.

అవినీతిలేని, క్లీన్‌ రాష్ట్రం మనకు రాదా అని బాధపడిన వారికి ఆశాకిరణంగా వైయస్‌ జగన్‌ వచ్చారు. ఇది కొందరికి నచ్చకపోవచ్చు. మరికొందరు అంగీకరించకపోవచ్చు. కానీ ఇదే వాస్తవమని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వంలో ఇంత లంచం పుచ్చుకుందని ఎవరైనా ఆరోపణ చేయగలరా? ఈ విధానంలో లోపభూయిష్టం ఉందని మాట్లాడగలరా?

మరి, గత ఐదేళ్ల చంద్రబాబు అవినీతి పాలనను ఇచ్చారని ధర్మాన మండిపడ్డారు. నిజాయితీగల పాలన అందించే వ్యక్తి సీఎంగా వచ్చారు. నిజం, నిజాయితీ తాలూక ప్రయోజనం అందటానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.  కానీ అందరూ అంగీకరించే సమయం రాబోతోందని ధర్మాన అన్నారు. 
 
నీరు చెట్టు బిల్లులు ఆపించారని చంద్రబాబు బాధపడుతున్నారు. కనీసం టెండర్లు పిలిచారా అని ధర్మాన ప్రశ్నించారు. నీటి సంఘాల ఎన్నికలు అభాసుపాలయ్యాయి. చేతులు ఎత్తితే నీ మనుషులే గెలవాలి. ప్రత్యర్థులు ఎవ్వరూ గెలవకూడదు. టెండర్లు కూడా ప్రత్యర్థులకు వెళ్లకూడదు అన్నట్లు చంద్రబాబు ఆనాడు వ్యవహరించారని ధర్మాన మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వర్షం: ఫ్రెండ్ పెళ్లికి వెళ్లొస్తూ సాగర్‌లో జల సమాధి అయిన ఆరుగురు