Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం: విజయసాయిరెడ్డి

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:27 IST)
విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయమని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు తగ్గట్టు విశాఖ కేంద్రంగా అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

భూమి విలువ ఆధారంగా ఇంటిపన్ను పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు. మురికివాడల రహిత నగరంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అమలు చేస్తామని చెప్పారు. విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారని దుష్ప్రచారం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.

ఇది ఈ ప్రభుత్వం కొత్తగా  ప్రవేశ పెట్టిన పద్దతి కాదని, కేంద్రం నుంచి నిధులు తీసుకొనేటప్పుడు ఆస్తులు గ్యారెంటీ చూపించడం సర్వసాధారణమని విజయసాయిరెడ్డి వివరించారు. జెఎన్ఎన్‌యుఆర్ఎం ఇళ్ల మరమ్మతులకు ఒక్కో ఇంటికి పదివేల రూపాయలు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

నగరంలోని మొత్తం  ఎనిమిది కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఒక్కో జోన్‌లో ఐదు కోట్లు చొప్పున వ్యయం అంచనాలతో కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. విశాఖలో తాగునీటి సమస్య లేకుండా రూ.500 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments