Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఈ-కేవైసీ’ ఎప్పుడైనా చేయించుకోవచ్చు.. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (18:59 IST)
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ)పై చెలరేగుతున్న వదంతులకు ప్రభుత్వ ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెరదించారు. ఈ-కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డులు రద్దుచేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఈ-కేవైసీ నమోదుచేయించుకోవడానికి గడువు లేదనీ, ఎప్పుడైనా చేయించుకోవచ్చని స్పష్టం చేశారు. కడప జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ-కేవైసీ సాకుతో రేషన్ డీలర్లు ప్రజల పేర్లను తొలగించినా, రేషన్ సరుకులు ఇవ్వకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ-కేవైసీ ప్రక్రియను సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ-కేవైసీ కోసం మహిళలు చంటి బిడ్డలతో గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments