Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టు తీర్పుపై ఆందోళన చెందొద్దు... ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం

అమరావతి : పదోన్నతుల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పుపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ భరోసా ఇచ్చారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం నిర్వహించిన విలేకర

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:38 IST)
అమరావతి : పదోన్నతుల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పుపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ భరోసా ఇచ్చారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు తమ ప్రభుత్వం రక్షణ కవచంగా ఉంటుందన్నారు. 
 
సుప్రీం కోర్టు తీర్పు కారణంగా పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి నష్టం కలుగదన్నారు. పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇది రాజ్యాంగమిచ్చిన హక్కు అని అన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు. వెనుకబాటుతనం, ప్రాతినిథ్యం, పరిపాలన దక్షత ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుంటారన్నారు. దీనిలో వెనుకబాటుతనం కొట్టేయమని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. 
 
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అమెరికా పర్యటన నుంచి సీఎం చంద్రబాబునాయుడు వచ్చాక సమావేశమై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో కలిసి చర్చిస్తామన్నారు. ఇప్పటికే  ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో చర్చించామన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments