Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుముకొస్తున్న 'జవాద్' - ఆ ఐదు రాష్ట్రాలకు భారీ వర్షాలు

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (14:58 IST)
బంగాళాఖాతంలో  ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. శుక్రవారం ఉదయానికి విశాఖపట్టణానికి 960 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, మధ్యాహ్నం 3 మూడు గంటలకు 420 కిలోమీటర్ల దూరంలో వుంది. 
 
అలాగే, ఒడిశా రాష్ట్రంలోని పరదీప్‌కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. అదేసమయంలో ఈ తుఫాను ప్రభావం కారణంగా గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఇదే అంశంపై భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర స్పందిస్తూ, జవాద్ తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ వర్షాలు ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కురుస్తాయి. 
 
ఈ తుఫాను ఈ నెల 4వ తేదీ శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్కా మధ్య తీరం దాటొచ్చని అంచని ఓ ప్రైవేటు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ కారణంగా ఉత్తర కోస్తా, ఒరిస్సా తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ముఖ్యంగా, ఏపీలోని విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ఆ మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారును కూడా నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments