మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (15:55 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ సతీమణి షహనాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేశ్‌లు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. 
 
ఫరూఖ్ సతీమణి మరణించారని వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టు చంద్రబాబు పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందడం ఆ కుటుంబానికి  తీరని లోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు, ఈ కష్ట సమయంలో గుండె నిబ్బరంతో ఫరూఖ్ కుటుంబ సభ్యులు ఉండాలని సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేసిన వేర్వేరు పత్రికా ప్రకటనల్లో పేర్కొన్నారు. 
 
కాగా, మంత్రి ఫరూఖ్ అర్థాంగి పవిత్ర రంజాన్ మాసంలో ఇంతిఖాల్ అయ్యారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆమెకు జన్నత్‌లో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఫరూఖ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments