Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవాన్ష్ పుట్టిన రోజు - తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు

Advertiesment
anna prasadam

ఠాగూర్

, శుక్రవారం, 21 మార్చి 2025 (11:51 IST)
ఏపీ మంత్రి నారా లోకేశ్ - బ్రాహ్మణి కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకున్న తిరుమల శ్రీవారి అన్నదాన పథకానికి నారా వారి కుటుంబం రూ.44 లక్షల విరాళం అంజేసింది. ముందుగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అల్పాహారాన్ని చంద్రబాబు కుటుంబం వడ్డించింది. 
 
కాగా, శ్రీవారి దర్శనం తర్వాత వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‍‌, ఇతర కుటుంబ సభ్యులకు మహద్వారం వద్ద ఆలయ అర్చకులు, తితిదే అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో చంద్రబాబు - భువనేశ్వ రి, నారా లోకేశ్ - బ్రాహ్మణి దంపతులు భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. 
 
అలాగే, ఒక్క రోజు అన్నప్రసాద వితవరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను చంద్రబాబు నాయుడు కుటుంబ శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు. కాగా, ప్రతియేటా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని నారా వారి కుటుంబం శ్రీవారి సేవలో పాల్గొంటున్న విషయం తెల్సిందే. కాగా, సీఎం చంద్రబాబు వెంట మంత్రి అనగాని సత్య ప్రసాద్, తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవీ జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి, పలువురు తితిదే సభ్యులతో పాటు తితిదే ప్రజాప్రతినిధులు నాయుకులు తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాడాబాంబ్ ఒకామి- అరుదైన వోల్ఫ్ డాగ్.. రూ.50 కోట్లు ఖర్చు చేసిన సతీష్.. ఎవరు?