Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాడాబాంబ్ ఒకామి- అరుదైన వోల్ఫ్ డాగ్.. రూ.50 కోట్లు ఖర్చు చేసిన సతీష్.. ఎవరు?

Advertiesment
Wolfdog

సెల్వి

, శుక్రవారం, 21 మార్చి 2025 (11:41 IST)
Wolfdog
బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ ఎస్ (భారతీయ కుక్కల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు) మరోసారి వార్తల్లో నిలిచారు. కాడాబాంబ్ ఒకామి అనే అరుదైన 'వోల్ఫ్‌డాగ్' కోసం $5.7 మిలియన్లు (సుమారు రూ. 50 కోట్లు) ఖర్చు చేశారు.
 
న్యూయార్క్ పోస్ట్‌లోని వార్తా నివేదిక ప్రకారం, ఈ అసాధారణ కుక్క ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కుక్కలలో ఒకటి మాత్రమే కాదు, ఈ రకమైన క్రాస్ బ్రీడింగ్ చేయడం వల్ల పుట్టిన మొదటి కుక్కగా నమ్ముతారు.
 
ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, కుక్కలంటే తనకు చాలా ఇష్టం, ప్రత్యేకమైన కుక్కలను కలిగి ఉండటానికి, వాటిని భారతదేశానికి పరిచయం చేయడానికి ఇష్టపడటం వలన కుక్కపిల్లని కొనడానికి 50 మిలియన్ రూపాయలు ఖర్చు చేశానని తెలిపారు.
 
అమెరికన్ కెన్నెల్ క్లబ్‌లోని నివేదిక ప్రకారం, ఈ కుక్క జాతి దాని రక్షణాత్మక ప్రవృత్తి, తెలివితేటలకు ప్రసిద్ధి చెందింది. దీని వయసు కేవలం ఎనిమిది నెలలు మాత్రమే. ఇంకా 5 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ కుక్క 7 ఎకరాల పొలంలో దాని సంరక్షకులతో విలాసవంతంగా ఉంటుంది. 
 
ఒకామి అనే పేరు చైనా పేరులా కనిపిస్తుంది కానీ అది పుట్టింది అమెరికాలో. ఇది ప్రతిరోజూ 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఈ కుక్క మనిషి మీద పడితే మాత్రం అతని కాళ్లు, చేతులు విరగడం ఖాయం. ఈ కుక్కకు రోజూ వారీ ఖర్చులు భారీగా ఉంటాయి. 
 
1990 నుంచి సతీష్ డాగ్ బ్రీడింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన వద్ద 150 రకాల జాతుల ప్రత్యేక కుక్కలు ఉన్నాయి. ఇవి చాలా పోటీల్లో పాల్గొని బహుమతులను కూడా గెలుచుకున్నాయి. కుక్కలను కొని వాటిని షోలలో ప్రదర్శించడం ద్వారా సతీష్ కు భారీ సంపాదన వస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?