పరీక్షా ఫలితాల వెల్లడికి నిపుణుల కమిటీ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (19:46 IST)
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దుతో పరీక్షా ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

ఫలితాల వెల్లడి కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను వెల్లడించేందుకు మూల్యాంకనం ఎలా ఉండాలన్న దానిపై నిపుణుల కమిటీ నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు.

మరోవైపు ప్రపంచబ్యాంకు నిధులతో ప్రాథమిక విద్యాబోధన ప్రాజెక్టు, విద్యాకానుక అమలు అంశాలపైనా చర్చించారు. 2021-22 విద్యా సంవత్సరం క్యాలెండర్ తయారీ, పాఠశాలలను తెరిచే అంశంపైనా సమీక్షించారు.

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తితో పాటు మూడో వేవ్ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో పాఠశాలలు తెరవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంబించాల్సిన విధివిధానాలపై అధికారులతో చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments