Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చిన పృథ్వీ

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (13:02 IST)
కమెడియన్ పృథ్వీ ప్రస్తుతం వైసీపీపై విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. వైసీసీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేసి 2014 ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న పృథ్వీ.. ప్రస్తుతం అదే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఆ పార్టీ కండువా కప్పుకున్నానని చెప్పిన పృథ్వి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.
 
పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి పృథ్వీ తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ నుంచి కూడా దూరమయ్యాడు.
 
అప్పట్లో పృథ్వికి సంబంధించిన ఓ ఆడియో కాల్ సెన్సేషన్ అయింది. అయితే ఈ విషయంలో తనపై కుట్ర జరిగిందంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
 
తాజాగా ఓ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చారు.. పృథ్వీ ప్రస్తుతం ఆ కామెంట్స్  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
 
తన రాజీకీయ జీవితంలోని చాలా విషయాలపై పృథ్వి ఓపెన్ అయ్యాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లుగా.. ఒకతను తన మైండ్‌ను పొల్యూట్ చేసి వైసీపీ వైపు నడిపించాడని పృథ్వి చెప్పడం గమనార్హం.
 
ఇకపోతే వైసీపీలోకి వెళ్లాక అహంకారం, కొవ్వు, మదం పట్టి నేనే టాప్ అన్నట్లుగా ఏది పడితే అది మాట్లాడేశాను అని పృథ్వి అన్నాడు. అప్పుడు అక్కడుంది పృథ్వీ కాదు.. ఒక ఉగ్రవాది అని చెబుతూనే ఆ పార్టీలో ఒక మూర్ఖుడిగా ఉండిపోయా అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం