విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ఖాయమని, ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పినా ఆగదని ఆయన అన్నారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా విశాఖకు పరిపాలన రాజధానిని అడ్డుకోలేరన్నారు.
ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, విశాఖకు ఏపీ పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందన్నారు. ఈ విషయంలో ఎవరు ఆపినా విశాఖకు పరిపాలన రాజధాని ఆగదన్నారు.
ఇకపోతే, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇచ్చే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అణగారిన వర్గాలకు అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారని ఆయన వ్యాఖ్యానించారు.