ఏపీ మంత్రివర్గం వాయిదా : కడపలో మూడు రోజుల పర్యటన

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదాపడింది. సెప్టెంబరు ఒకటో తేదీన జరగాల్సిన ఈ కేబినెట్ భేటీని వాయిదా వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కారణం లేకపోలేదు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనకు వెళుతున్నారు. దీంతో ఒకటో తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని ఏడో తేదీకి వాయిదా వేశారు. 
 
కడప పర్యటన కోసం సీఎం జగన్ సెప్టెంబరు ఒకటో తేదీన గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయ కాంప్లక్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయల్దేరి సాయంత్రం 5.35 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. 
 
2వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ వర్థంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ పిమ్మట అక్కడే ఉన్న ప్రార్థనా మందిరంలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారు. సాయంత్రం వరకు ఈ సమీక్షా సమావేశం కొనసాగుతుంది. రాత్రికి మళ్లీ ఇడుపులపాయకు చేరుకుని అక్కడే బస చేస్తారు. మూడో తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments